స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం మళ్లీ జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లును ఖరారు చేసింది. శ్రీకాకుళం బీసీ మహిళ, విజయనగరం జనరల్, విశాఖ ఎస్టీ మహిళ, తూర్పుగోదావరి ఎస్సీ, పశ్చిమగోదావరి బీసీ, కృష్ణ జనరల్ మహిళ, గుంటూరు ఎస్సీ మహిళ, ప్రకాశం జనరల్ మహిళ, నెల్లూరు జనరల్ మహిళ, కడప జనరల్, అనంతపురం బీసీ మహిళ, కర్నూలు జనరల్, చిత్తూరు జనరల్ అభ్యర్థులకు రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
59.85 శాతం రిజర్వేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లను ఖరారు చేసింది. శ్రీకాకుళం ఎస్సీ మహిళ, విజయనగరం జనరల్, విశాఖ బీసీ మహిళ, తూర్పుగోదావరి జనరల్ మహిళ, పశ్చిమ గోదావరి బీసీ మహిళ, కృష్ణా బీసీ, గుంటూరు జనరల్ మహిళ, ప్రకాశం జనరల్, నెల్లూరు ఎస్టీ, వైఎస్సార్ కడప జనరల్, అనంతపురం ఎస్సీ, కర్నూలు జనరల్ మహిళ, చిత్తూరు బీసీలకు కేటాయించారు.
5574