iDreamPost
android-app
ios-app

అన్నదాత కోసం వైఎస్సార్ యాప్ – ప్రారంభించిన సీఎం జగన్

అన్నదాత కోసం వైఎస్సార్ యాప్ – ప్రారంభించిన సీఎం జగన్

రైతు సంక్షేమమే లక్ష్యంగా పధకాలు, కార్యక్రమాలు చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతల కోసం మరో అడుగు వేసింది. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు మేలు చేసేందుకు వైసిపి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రం ప్ర‌భుత్వం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించేందుకు సిద్ధమైంది.

రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వ్యవ‌సాయశాఖ రూపొందించిన వైఎస్సార్ యాప్‌ను రూపొందించింది. దీన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తన క్యాంప్ కార్య‌ల‌యంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, వివిధ పథకాలు, రైతు భరోసా కేంద్రాల్లోని పరికరాలు, వాటి వినియోగం తెలుసుకోవ‌చ్చు.

రైతు భరోసా కేంద్రాల్లోని కియోస్క్, ఇతర పరికరాల్లో ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు తక్షణం స్పందించేందుకు వీలుగా సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రజల కోసం కొత్తగా రూపొందిస్తున్న పథకాలపై వివిధ వర్గాల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను కూడా స‌రైన స‌మ‌యంలో ప్రభుత్వానికి అందించేందుకు ఈ యాప్ ద్వారా అవకాశం ఏర్పడుతుంది. ఈ యాప్‌లో రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులు వేసే పంటలను ఈ-క్రాప్ కింద నమోదు చేయడం, పొలంబడి కార్యక్రమాలు, సిసి ఎక్స్‌పెరిమెంట్స్, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, విత్తన ఉత్పత్తి క్షేత్రాలను సందర్శించడం, భూసార పరీక్షల కోసం నమూనాల సేకరణతోపాటు పంటల బీమా పథకం, సేంద్రీయ ఉత్పత్తుల కోసం రైతులను సిద్దం చేయడం, రైతులకు ఇన్‌పుట్స్ పంపిణీ వంటి అన్ని కార్యక్రమాలను ఆర్‌బీకే సిబ్బంది ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. దీవీటిని ఉన్నత అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetmeritbetMarsbahis GirişCasibom Girişmeritbet