iDreamPost
android-app
ios-app

ఫేమస్ లవర్ ఇది మిస్సవుతున్నాడు

  • Published Jan 31, 2020 | 5:22 AM Updated Updated Jan 31, 2020 | 5:22 AM
ఫేమస్ లవర్ ఇది మిస్సవుతున్నాడు

విజయ్ దేవరకొండ కొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ విడుదలకు ఇంకో రెండు వారాలు మాత్రమే టైం ఉంది. ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ప్రమోషన్లు ఏవి గ్రాండ్ గా చేయలేదు. నిర్మాత కెఎస్ రామారావు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తప్పించి పూరి ఫైటర్ కోసం ముంబైలో ఉన్న హీరో ఇంకా తిరిగి రావాల్సి ఉంది. కెరీర్ లో మొదటిసారి నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండకు ఇది సక్సెస్ కావడం చాలా అవసరం.

గత చిత్రం డియర్ కామ్రేడ్ అంచనాలు అందుకోలేకపోయింది. దాని కోసం రిలీజ్ కు ముందు మ్యూజికల్ ఈవెంట్స్ పేరుతో విజయ్ దేవరకొండ మూడు రాష్ట్రాలు చుట్టేసి విస్తృతంగా ప్రచారం చేసి పెట్టాడు. మైత్రి సంస్థ సైతం పబ్లిసిటీ కోసం భారీగానే మొత్తాలను వెచ్చించింది. కానీ రిజల్ట్ మాత్రం నిరాశ కలిగించింది. కానీ వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో మాత్రం అంత హడావిడి కాదు కదా అందులో సగం కూడా కనిపించడం లేదు నిన్నో ఆడియో లిరికల్ వీడియో విడుదల చేశారు తప్ప ఇంకా ప్రచారం ఊపందుకోవాల్సి ఉంది.

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో రాశి ఖన్నా, కాథరిన్ త్రెసా, ఐశ్వర్య రాజేష్, ఇజాబెల్లె విజయ్ సరసన జోడిగా నటిస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండది ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రట. నవలా రచయితగా వివిధ దశల్లో తన ప్రేమ కథను చెబుతూ ఈ అమ్మాయిలతో రొమాన్స్ చేయడాన్ని చూపిస్తారని ఇన్ సైడ్ టాక్. ఉంగరాల రాంబాబు లాంటి డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ క్రాంతి మాధవ్ కు కం బ్యాక్ అవ్వడానికి ఇదే మంచి ఛాన్స్. గోపి సుందర్ సంగీతానికి స్పందన బాగానే ఉంది. మాస్ కి కనెక్ట్ కాలేని విధంగా పూర్తి ఇంగ్లీష్ టైటిల్ తో వస్తున్న ఈ ప్రపంచ ప్రేమికుడు ప్రేక్షకులను ఎంత మేర మెప్పిస్తాడో ఫిబ్రవరి 14న తేలిపోతుంది

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom Girişenbet girişHoliganbet Giriş