iDreamPost
android-app
ios-app

టిల్లు స్క్వేర్ కి హీరోయిన్ గండం

  • Published Dec 08, 2022 | 3:12 PM Updated Updated Dec 08, 2022 | 3:12 PM
టిల్లు స్క్వేర్ కి హీరోయిన్ గండం

మురారి సినిమాలో మహేష్ బాబు ఫ్యామిలీకి ఏదో శాపం పెట్టినట్టు డీజే టిల్లుకి హీరోయిన్ దొరకడమే పెద్ద సవాల్ గా మారుతోంది. ఒకరు రావడం మళ్ళీ మారడం తీరా చూస్తే వాళ్ళూ వెళ్లిపోవడం ఇదో నిత్య కృత్యంగా మారిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తక్కువ అంచనాలతో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డీజే టిల్లుకి దాన్ని మించిన సీక్వెల్ తీయాలనే సంకల్పంతో ఉన్నాడు హీరో సిద్దు జొన్నలగడ్డ. దానికోసమే రాజీపడకుండా ఏకంగా దర్శకుడిని కూడా మార్చుకున్నారు. విమల్ కృష్ణ నుంచి మల్లిక్ రామ్ ఆ బాధ్యతలు తీసుకున్నాక అంతా సవ్యమే అనుకున్నారు. తీరా చూస్తే అసలైన కథానాయికదగ్గర పదే పదే ఒకే సమస్య వచ్చి పడుతోంది.

ఫస్ట్ లాక్ చేసుకున్న శ్రీలీల బిజీ షెడ్యూల్స్ కారణంగా తప్పుకుందని చెప్పారు. ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ ఆ ప్లేస్ ని తీసుకుంది. అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తీరా చూస్తే నేనూ చేయలేనంటూ డ్రాపయ్యింది. సరేనని శ్యామ్ సింగ రాయ్ లో లాయర్ గా మెప్పించిన మడోన్నా సెబాస్టియన్ కి ట్రయిల్ షూట్ చేశారు. కానీ అవుట్ ఫుట్ సంతృప్తికరంగా రాకపోవడంతో తననీ వద్దని చెప్పారట. నెక్స్ట్ హిట్ 2తో లేటెస్ట్ గా హిట్టు కొట్టిన మీనాక్షి చౌదరిని ట్రై చేస్తున్నారు. అసలు ఇంతమంది మారడానికి కారణం అందులో ఘాటు లిప్ లాక్ సీన్సేనని ఇన్ సైడ్ టాక్. ఇందులో ఇంటిమసి సీన్లు ఎక్కువగా పెట్టారని అందుకే ఇలా జరుగుతోందని వినికిడి

ఏది ఏమైనా టిల్లు స్క్వేర్ లాంటి మీడియం బడ్జెట్ సినిమాకు రాకూడని సమస్యే ఇది. నిజంగా ప్రచారం జరుగుతున్నట్టు ఆ తరహా సన్నివేశాలే అందరూ వెళ్లిపోయేలా చేస్తున్నాయా లేక ఇంకేదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. అనూహ్యంగా దక్కిన ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నంలో సిద్దు జొన్నలగడ్డ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా మార్కెట్ దెబ్బ తింటుంది. అందుకే వన్ మూవీ వండర్ గా మారకుండా ఉండేందుకు పక్కా ప్లానింగ్ చేసుకుంటున్నాడు. రచయిత కూడా తనే కాబట్టి ఈ టిల్లు స్క్వేర్ ని చాలా జాగ్రత్తగా చెక్కుతున్నాడని సన్నిహితులు అంటున్నారు. సితార బ్యానర్ లో ఈసారి బడ్జెట్ బాగా పెంచేశారట

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom