iDreamPost
android-app
ios-app

Pushpa Pre Release : బన్నీ అభిమానులు ఎందుకు హర్ట్ అయ్యారు

  • Published Dec 14, 2021 | 4:57 AM Updated Updated Dec 14, 2021 | 4:57 AM
Pushpa Pre  Release : బన్నీ అభిమానులు ఎందుకు హర్ట్ అయ్యారు

నిన్న హైదరాబాద్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బలు తిన్నారన్న వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. మొన్న పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమంగా లేనప్పటికీ దెబ్బలు మాత్రం గట్టిగానే తగిలాయి. దీనికి తోడు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి, నిర్మాతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారట. పరిమితికి మించి జనాన్ని పోగు చేయడం, సరైన సెక్యూరిటీ లేకపోవడం లాంటి కారణాలు చూపి వివరణ అడిగారు. ఆ రోజు అల్లరి తాలూకు వీడియోలు యుట్యూబ్ తదితర మాధ్యమాల్లో బయటికి రావడంతో ఫ్యాన్స్ మధ్య చాలా చర్చలు జరిగాయి. అసలు జరిగింది ఏమిటి.

నిన్న బన్నీ తన అభిమానులతో ప్రత్యేకంగా ఫోటో సెషన్ చేస్తారని ఓ కబురు బయటికి వచ్చింది. వేదికగా అందులో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని పేర్కొన్నారు. దీంతో తండోపతండాలుగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. పుష్ప ఈవెంట్ బాగా లేట్ అయిపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లు నగరంలోనే మకాం పెట్టారు. తిరిగి ఊళ్లకు వెళ్ళిపోదాం అనుకుంటున్న టైంలో ఈ మెసేజ్ అందాక ప్రయాణం వాయిదా వేసుకుని అక్కడికి వెళ్లారు. తీరా చూస్తే అసలే ఫోటో షూట్ లేదని తెలిసి నిరాశతో కొందరు వెనుతిరగగా మరికొందరు సహనం కోల్పోయి గేట్లు ధ్వంసం చేయడం లాంటి చర్యలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులకు లాఠీఛార్జ్ చేయక తప్పలేదు

ఫోటో సెషన్ గురించిన రచ్చ నిన్న గీత ఆర్ట్స్ ఆఫీస్ దగ్గర కూడా జరిగింది. అలాంటిదేమి ప్లాన్ చేయలేదని అక్కడి సిబ్బంది చెప్పడంతో కన్ఫ్యూజన్ మరింత ఎక్కువయ్యింది. దీంతో ఇది కాస్తా మరోరకంగా ప్రచారానికి దారితీయడంతో అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు క్షమాపణ లాంటి వివరణ ఇస్తూ భవిషత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. దీని వెనుక కారణాలను తన టీమ్ విచారించే పనిలో ఉందని, దేన్నీ తేలికగా తీసుకునే ప్రశ్నే లేదని ఫ్యాన్స్ కి ఊరట కలిగించాడు. మొత్తానికి ఆదివారం సాయంత్రం మొదలైన పుష్ప రచ్చ నిన్న కూడా కొనసాగటం విచారకరం. ఇంకో మూడు రోజుల్లో పుష్ప థియేటర్లలో రానుంది

Also Read : Akhanda Remake : ఎవరితో రీమేక్ చేసినా రిస్క్ అవుతుందేమో