iDreamPost
android-app
ios-app

Acharya & Vikram : చిరు ప్లానింగ్ కి కమల్ బ్రేక్ ?

  • Published Feb 09, 2022 | 10:03 AM Updated Updated Feb 09, 2022 | 10:03 AM
Acharya & Vikram : చిరు ప్లానింగ్ కి కమల్ బ్రేక్ ?

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కొత్త డేట్ ఏప్రిల్ 29 ఆల్రెడీ లాక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ కూడా ఉండటంతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఆ డేట్ కంతా పరిస్థితులు పూర్తిగా చక్కబడటంతో పాటు ఎలాంటి ఆంక్షలు ఉండవనే ఆశాభావంతో దర్శక నిర్మాతలు ఉన్నారు. మూడేళ్లు ఈ ప్రాజెక్టు మీదే వర్క్ చేసిన దర్శకుడు కొరటాల శివ ఆచార్య ప్రమోషన్ పనులు పూర్తి కాగానే జూనియర్ ఎన్టీఆర్ సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టబోతున్నాడు. ఎక్కువ ఆలస్యం చేయకుండా వేగంగా పూర్తి చేసేలా షెడ్యూల్స్ వేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఆచార్యకు పోటీగా ఎఫ్3 ఒక రోజు ముందు వస్తోంది. రెండు వేర్వేరు జోనర్లు కాబట్టి ఇబ్బందేమీ లేదు. కానీ తాజాగా కమల్ హాసన్ కొత్త మూవీ విక్రమ్ కూడా 29కే ఫిక్స్ చేసుకోబోతోందని చెన్నై టాక్. మాస్టర్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన లోకేష్ కనకరాజ్ దీనికి దర్శకుడు. పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో తీసుకొస్తారు. అదే జరిగితే ఆచార్యకు నార్త్ లో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అంతే కాదు ఆ సమయానికి కనీసం రెండు మూడు బాలీవుడ్ సినిమాలు లైన్ లో ఉంటాయి. వీటిని తట్టుకుని ఉత్తరాది మార్కెట్ లో నెగ్గుకురావడం అంత సులభం కాదు. గతంలో చాలా అరుదుగా చిరు కమల్ ల క్లాష్ జరిగింది.

ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు కానీ నమ్మదగిన సోర్స్ నుంచే లీక్స్ వచ్చాయి కాబట్టి నిజమయ్యే అవకాశాలు కొట్టి పారేయలేం. కొన్నేళ్లుగా తన స్థాయి హిట్టు లేక సతమతమవుతున్న కమల్ కు విక్రమ్ హిట్ కావడం చాలా అవసరం. ఇండియన్ 2 మళ్ళీ ఎప్పుడు కంటిన్యూ చేస్తారో తెలియదు. కొంత భాగం తీశాక శభాష్ నాయుడుని ఆపేశారు. రీ స్టార్ట్ అయ్యే అవకాశం కూడా లేనట్టే. అందుకే విక్రమ్ మీద అభిమానులు చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆచార్యని ఢీ కొట్టినా పర్లేదు అనుకుంటే డేట్ మారదు. విజయ్ బీస్ట్ వచ్చిన రెండు వారాలకే విక్రమ్ ను ప్లాన్ చేయడం చూస్తుంటే ఏప్రిల్ లో బాక్సాఫీస్ రచ్చ మాములుగా ఉండేలా లేదు

Also Read : Bheemla Nayak : టాక్ అఫ్ ది ట్రేడ్ గా మారిన పవన్ మూవీ

marsbahis girişjojobet girişjojobet girişjojobetjojobet girişJOJOBET GİRİŞjojobetjojobet girişgamdomgrandpashabetCasibomjojobet girişMarsbahis