iDreamPost
android-app
ios-app

తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌

తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌

తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. జనగాం ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి, నిజమాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్లకు వైరస్‌ సోకిందని నిర్థారణ అయింది. వీరిద్దరూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారు. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ఓఎస్‌డీకి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఈటెల హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.

లాక్‌డౌన్‌ సమయంలో తెలంగాణలో వైరస్‌ నియంత్రణలోకి వచ్చినట్లు కనిపించగా.. ఆ తర్వాత లాక్‌డౌన్‌ సడలింపులతో వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వెయి కేసులు నమోదవగా.. అందులో ఒక్క హైదరాబాద్‌ పరిధిలోనే 800 కేసులకు పైగా నమోదవడం నగరంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం తెలంగాణలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 4,500 దాటింది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetmadridbetmeritbetMarsbahis GirişCasibom Girişmeritbet