iDreamPost
android-app
ios-app

క్లారిటీ మిస్సవుతున్న మెగా 152

  • Published Feb 17, 2020 | 12:24 PM Updated Updated Feb 17, 2020 | 12:24 PM
క్లారిటీ మిస్సవుతున్న మెగా 152

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఒక పాట, మూడు ఫైట్లతో పాటు కొంత టాకీ పార్ట్ పూర్తి చేశారు. హీరొయిన్ త్రిష(ఇంకా అధికారికంగా చెప్పలేదు) ఎంటర్ కాగానే ఇంకా స్పీడ్ పెరుగుతుందని ఇన్ సైడ్ టాక్. ఈ లెక్కన సరిలేరు నీకెవ్వరు వేడుకలో చిరు కోరినట్టు కొరటాల శివ అనుకున్న టైంలోనే మొత్తం పూర్తి చేసి ఫైనల్ కాపీ చేతికిచ్చేలా ఉన్నాడు. ఇదంతా బాగానే ఉంది కాని ఒక క్లారిటీ మాత్రం మిస్సవుతోంది.

ఇందులో రామ్ చరణ్ ముప్పాతిక గంట పాటు సాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. దాని కోసం ఇప్పటికే డేట్స్ ప్లాన్ చేసి పెట్టారట. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే దాకా ఇద్దరు హీరోల ఇతర సినిమాలు విడుదల కాకూడదని రాజమౌళి ముందే కండిషన్ పెట్టడంతో మెగా 152 వచ్చే ఏడాదే వస్తుందని కొద్దిరోజుల క్రితం చాలా జోరుగా ప్రచారం సాగింది. ఒకవేళ ఇదే నిజమైతే షూటింగ్ ఇప్పుడీ మెగా 152 త్వరగా పూర్తయినా ఫైనల్ కాపీ చేతిలో పెట్టుకుని ఆరు నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది.

అసలే ఇది టెక్నాలజీ కాలం. రిలీజ్ కు ముందే కొన్ని సినిమాలు పైరసీ బారిన పడి చాలా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో చిరు జక్కన్నల మధ్య ఏదైనా అండర్ స్టాండింగ్ వస్తుందేమో చూడాలి. లేదు రాజమౌళి ఒప్పుకోలేదు అంటే ఏమి చేయలేని పరిస్థితి. రిలీజ్ లేట్ అయితే కొరటాలకు కూడా చిక్కే. ఇతనితో చేయడానికి స్టార్లు రెడీగానే ఉన్నారు కానీ షూట్ కంప్లీట్ అయిన మూవీ అలా ఆగిపోతే అదో రకమైన ఇబ్బంది. సో దీనికి సంబంధించిన క్లారిటీ రావాలంటే కొంత టైం పట్టేలా ఉంది. ఇప్పటికే దీని కోసం ఆచార్య అనే టైటిల్ రిజిస్టర్ చేశారు కానీ యూనిట్ ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు. దీని తర్వాత చిరంజీవి ఇంకా ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. హరీష్ శంకర్ త్వరలో ఆయనతో చేస్తానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం కొసమెరుపు

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobetcasibom girişholiganbet girişholiganbetvaycasinomarsbahis giriş