iDreamPost
iDreamPost
 
        
బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ బిశ్వభూషణ్ తన పసంగంలో రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో జగన్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది , సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. పథకాలు ఏ స్థాయిలో ప్రజలకి అందాయి అనే అంశాన్ని వివరించారు. ఈ క్రమంలో ఆయన రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంచరించుకున్న రాజధానుల విషయంపై కూడా స్పందించారు.
గవర్నర్ తన ప్రసంగంలో పరిపాలనా వికేద్రీకరణ అంశాన్నీ కీలకంగా ప్రస్థావిస్తూ. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వహక రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండబోతుందని స్పష్టం చేశారు. గవర్నర చేసిన ఈ కీలక ప్రకటనతో రాజధాని వికేంద్రికరణ బిల్ ఇంకా లైవ్ లోనే ఉన్న్నట్టు , నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే 8 బిల్లులలో ఈ బిల్లు కూడా ఉండబోతోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
