iDreamPost
iDreamPost
విడుదలకు తొమ్మిది రోజులే ఉన్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చుట్టూ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. రాజమౌళి చేసిన విస్తృతమైన ప్రమోషన్లకు, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా చేసిన పబ్లిసిటీకి భారీ ఓపెనింగ్స్ ఖాయమనే నమ్మకం వ్యక్థమవుతున్న తరుణంలో జరుగుతున్న పరిణామాలు కంటిమీద కునుకుని దూరం చేసేలా ఉన్నాయి. అమెరికాలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇది విశ్వరూపం చూపిస్తోంది. సగటున ప్రతి 10 మంది పిల్లలో ఒకరు ఇన్ఫెక్ట్ అయ్యారని అక్కడి మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొత్తం చిన్నారుల జనాభాలో 17 శాతం ఈ వైరస్ బారిన పడ్డారట.
ఇది ఇక్కడితో ఆగలేదు. ఎప్పుడు ఆగుతుందో తెలియదు. యుఎస్ లో ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే రెండు మిలియన్ల మార్కు దాటింది. ట్రిపులార్ కు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ చాలా కీలకం. అక్కడి పరిస్థితుల దృష్ట్యా కుటుంబాలు థియేటర్లకు వస్తాయా లేక ప్రభుత్వాలే ఏమైనా ఆంక్షలు విధిస్తాయా వేచి చూడాలి. ఇక ఇండియా విషయానికి వస్తే ఢిల్లీలో సినిమా హాళ్ల మూసివేత, మహారాష్ట్రలో సెకండ్ షోల రద్దు, రాత్రి కర్ఫ్యూ లాంటి కండీషన్లు డిస్ట్రిబ్యూటర్లను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలా అయితే రెవిన్యూ బాగా తగ్గిపోతుందని, తమ పెట్టుబడులు రిస్క్ లో పడతాయని వాపోతున్నారు. సర్దుకోవడానికి ఎక్కువ టైం లేదు..
ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి నార్మల్ గానే ఉంది కానీ ఏ క్షణాన ఎలాంటి ట్విస్టు జరుగుతుందో ఎవరు చెప్పగలరు. ఏపిలో టికెట్ రేట్ల ఇష్యూ ఇంకా తేలలేదు. స్పెషల్ షోలకు తెలంగాణలోనూ పర్మిషన్లు ఇస్తారా లేదా అనేది 6వ తేదీకి ముందు ఉన్న కేసుల సంఖ్యను బట్టి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య మాత్రం వాయిదా ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారట. ఒకవేళ పోస్ట్ పోన్ అంటే అదంత ఈజీగా ఉండదు. చాలా పెద్ద స్థాయిలో మొత్తాలు చేతులు మారాల్సి ఉంటుంది. ఆపై డేట్ ని మార్చడం కూడా తలసెప్పే. సో ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఆర్ఆర్ఆర్ ఖచ్చితంగా జనవరి 7నే వస్తుందంటున్నారు. అదే జరగాలి మరి
Also Read : Faria Abdullah : మంచిరోజుల హీరోతో జాతిరత్నాలు బ్యూటీ