iDreamPost
android-app
ios-app

మళ్ళీ పెళ్లిలో రియల్ ట్విస్ట్

  • Published Jul 30, 2021 | 6:38 AM Updated Updated Jul 30, 2021 | 6:38 AM
మళ్ళీ పెళ్లిలో రియల్ ట్విస్ట్

మొన్న హీరో సుమంత్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని వధువు పేరు పవిత్రగా ఉన్న ఒక వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇది నిజమే అనుకున్న చాలా మీడియా సంస్థలు దాని మీద కథనాలు కూడా రాసేశాయి. కీర్తిరెడ్డితో చాలా ఏళ్ళ క్రితమే విడాకులు తీసుకున్న సుమంత్ మళ్ళీ వివాహం చేసుకోలేదు. అసలు ఆ ప్రస్తావన కూడా ఎప్పుడు తేలేదు. నరుడా డోనరుడాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక సినిమాలతో బిజీ అయిపోయిన సుమంత్ కు మళ్ళీ రావా హిట్టయ్యాక అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు రెండు మూడు ప్రాజెక్టులతో వరస కమిట్ మెంట్లతో కెరీర్ ని బాగానే ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇప్పుడీ పెళ్లి వార్తతో ఇంకో రకంగా ప్రచారం జరగడం మాత్రం విచిత్రమే. నిజానికి ఆ వెడ్డింగ్ కార్డు నిజమో కాదో అని కనుక్కునే ప్రయత్నం కూడా ఎవరూ గట్టిగా చేసినట్టు లేరు. రామ్ గోపాల్ వర్మ దీని గురించి వ్యంగ్యంగా ట్వీట్ చేయడం అది కాస్తా వైరల్ కావడంతో నిన్న సాయంత్రం సుమంత్ ఏకంగా ఒక వీడియో మెసేజ్ లో దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకునే కాన్సెప్ట్ తో రూపొందుతున్న సినిమాలో తాను నటిస్తున్నానని అంతే తప్ప సెకండ్ మ్యారేజ్ నిజంగా చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చేసరికి ఫైనల్ గా దీనికి చెక్ పడిపోయింది.

టెక్నాలజీ పెరిగిపోయి సోషల్ మీడియా విస్తృతం అయ్యాక నిజానిజాల కన్నా ముందు అబద్దాలు వేగంగా పరిగెత్తుతున్నాయి. ఎవరైనా సెలబ్రిటీ అనారోగ్యంగా ఉంటే ఏం జరుగుతోందో తెలుసుకోకుండా వాళ్ళు కీర్తి శేషులు అయ్యారని అభిమానులను బాధ పెట్టిన సంఘటనలు గతంలో కొల్లలు. ఇప్పుడు చావులు వదిలి పెళ్లిళ్లను స్టార్ట్ చేశారన్న మాట. అయినా సుమంత్ నిజంగా పెళ్లి చేసుకోదలుచుకుంటే దాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం తనకే మాత్రం లేదు. తప్పు అనే హక్కు ఎవరికీ లేదు. ఇంతకీ ఈ ప్రహసనమంతా ఆ కొత్త సినిమా పబ్లిసిటీ కోసం వేసిన ప్లానా అని అనుమానపడుతున్న వాళ్ళు లేకపోలేదు

Also Read: కనకవర్షం కురిపిస్తున్న డబ్బింగ్ హక్కులు