కనకవర్షం కురిపిస్తున్న డబ్బింగ్ హక్కులు

By iDream Post Jul. 30, 2021, 11:41 am IST
కనకవర్షం కురిపిస్తున్న డబ్బింగ్ హక్కులు

ఎలా చూసుకున్నా రీమేక్ సినిమాలతో పవన్ కళ్యాణ్ నిర్మాతలు అద్భుతమైన బిజినెస్ గేమ్ ఆడుతున్నారు. దానికి ఉదాహరణగా వకీల్ సాబ్, అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ లు నిలుస్తున్నాయి. వందల కోట్ల బడ్జెట్ అవసరం లేకుండా కేవలం పవన్ రెమ్యునరేషన్ ఒక్కటే భారీ స్థాయిలో ముట్టజెప్పి మిగిలినదంతా సేఫ్ గా ఖర్చు పెట్టేసుకుని భారీ లాభాలు వెనకేసుకుంటున్నారు. వకీల్ సాబ్ నే తీసుకుంటే సగం సినిమా కోర్టు సెట్ లో మిగిలిన సగం హైదరాబాద్ రెండు మూడు లొకేషన్లలో జరిగిపోతుంది. విదేశాలు, ఖరీదైన సెట్లు, గ్రాఫిక్సు ఇవేవి ఇంచు కూడా అవసరం పడలేదు. కట్ చేస్తే అన్ని హక్కులు కలుపుకుని అది చేసిన బిజినెస్ 150 కోట్లకు పైమాటే.

ఇప్పుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ రచనలో రూపొందుతున్న అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ కూడా ఇదే దారిలో సాగుతోంది. లేటెస్ట్ గా దీని హిందీ డబ్బింగ్ హక్కులు 23 కోట్లకు అమ్ముడుపోయాయనే వార్త హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఇది చాలా భారీ మొత్తం. అందులోనూ ప్రైమ్ లో సబ్ టైటిల్స్ తో సహా ఒరిజినల్ వెర్షన్ అందుబాటులో ఉంది. అయినా కూడా ఇంత రేట్ పలకడం అసాధారణం. పవన్ ఇమేజ్, బాహుబలి విలన్ గా రానాకు నార్త్ లో ఉన్న ఇమేజ్, మల్టీ స్టారర్ అనే బ్రాండింగ్ వెరసి ఇవన్నీ ఇంత డిమాండ్ కు కారణం అయ్యాయి. ఇంకా శాటిలైట్ డీల్ ఫైనల్ కాలేదని వినికిడి.

గతంలో వినయ విధేయ రామ 21 కోట్లకు అమ్ముడుపోవడం అప్పట్లో రికార్డు. ఇప్పుడు దాన్ని పవన్ ఓవర్ టేక్ చేశాడు. హిందీ డబ్బింగ్ హక్కులు మన నిర్మాతలకు ఎంత పెద్ద ఆదాయ వనరుగా మారుతున్నాయో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదు. ఇలా అనువదించినా సరే మళ్ళీ రీమేక్ హక్కులకు సెపరేట్ గా ఆదాయం వస్తోంది. అంటే కాంబినేషన్ కరెక్ట్ గా కుదరాలే కానీ ముప్పాతిక ప్రొడక్షన్ బడ్జెట్ ని ఇలా డబ్బింగ్ ప్లస్ రీమేక్ రూపంలో రాబట్టుకోవచ్చు. సంక్రాంతికి రాబోతున్న పవన్ రానాల సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. పవన్ పుట్టినరోజుకు వెల్లడి చేసే అవకాశం ఉంది

Also Read: 2022 - మొదటి పాన్ ఇండియా రిలీజ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp