iDreamPost
android-app
ios-app

ఏపీలో ఎమ్మెల్యేకు సోకిన కరోనా

ఏపీలో ఎమ్మెల్యేకు సోకిన కరోనా

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన సామాన్య ప్రజలతోపాటు సినీ నటులు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా బారిన పడే ప్రజాప్రతినిధుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇటీవల తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా వారందరూ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా సోకిందని నిర్థారణ అయింది. ఆయనతోపాటు గన్‌మెన్‌కు కరోనా సోకింది.

ఎమ్మెల్యే శ్రీనివాస రావు ఈ నెల 10వ తేదీన అమెరికా నుంచి స్వస్థలానికి వచ్చారు. అక్కడ నుంచి రాగానే కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కానీ అప్పుడు నెగిటివ్‌ వచ్చింది. అసెంబ్లీ సమావేశాల్లోనూ, ఈనెల 19న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ పాల్గొన్నారు. తాజాగా మరోసారి ట్రూనాట్‌ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ అని తేలిసింది. టీపీసీఆర్‌ టెస్ట్‌లోనూ పాజిటివ్‌ అని తేలడంతో హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alAlobetAlobetPiabellacasinokatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş