iDreamPost
android-app
ios-app

షాకింగ్ టైటిల్ తో బన్నీ 20 ?

  • Published Apr 07, 2020 | 6:12 AM Updated Updated Apr 07, 2020 | 6:12 AM
షాకింగ్ టైటిల్ తో బన్నీ 20 ?

రేపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా తాలూకు ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్ మెంట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అడవి బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ సబ్జెక్టుతో సుకుమార్ దీన్ని చాలా పవర్ ఫుల్ గా రాసుకున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. తమిళ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైం ఉండగానే ఫిలిం నగర్ లో దీని టైటిల్ తాలుకు లీకేజీ న్యూస్ తో సందడి మొదలైంది. దాని ప్రకారం ఈ మూవీకి ‘పుష్ప’ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా చెబుతున్నారు.

ఇది ఒకరకంగా ఫ్యాన్స్ ఊహించని షాకే. లేడీ ఓరియెంటెడ్ స్టొరీలా ఇదేం పేరు అని అనుకుంటున్న వారు లేకపోలేదు. కాని సుక్కు ఆలోచన వేరుగా ఉందట. హీరొయిన్ పేరు పుష్ప అని కథలో సెంట్రల్ పాయింట్ తనదే కావడంతో ఇలా ఆలోచించినట్టుగా వినికిడి. రేపు అధికారికంగా ప్రకటించే వరకు ఏదీ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఈ పుష్ప వార్త నిజమే అయితే రష్మిక మందన్నకు సూపర్ ఛాన్స్ దక్కినట్టె. ఎందుకంటే గీత గోవిందం తర్వాత ఆ స్థాయి ప్రాధాన్యత ఉన్న పాత్ర మళ్ళి తనకు దక్కలేదు.

హిట్లు పడుతున్నాయి కాని అవన్నీ హీరోల ఎకౌంటుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అందుకే బలమైన పాత్ర కోసం ఎదురు చూస్తోంది. దానికి తగ్గట్టే అల్లు అర్జున్ సరసన ఛాన్స్ తో పాటు టైటిల్ కూడా తన పేరు మీదే ఉంటె అంత కంటే కావాల్సింది ఏముంటుంది. కరోనా పరిస్థితి సద్దుమణిగాక హైదరాబాద్ శివార్లలో ఈ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. కేరళలో కొనసాగించే అవకాశం లేకపోవడంతో పాటు విదేశాలకు అనుమతులు దొరికే ఛాన్స్ లేకపోవడంతో ఆఖరికి సిటీతోనే సర్దుకుంటున్నారు. కొన్ని ప్రత్యేకమైన సెట్లు కూడా వేస్తారట. దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన సస్పెన్స్ రేపు ఉదయం 9 గంటలకు వీగిపోతుంది. చూద్దాం.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirKulisbetKulisbetMadridbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş