iDreamPost
iDreamPost
IPL ప్రారంభం నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మంచి ఆటని కనబరుస్తుంది. రెండు సార్లు ఛాంపియన్ కూడా అయింది ఈ జట్టు. ఈ జట్టు ఓనర్స్ షారుక్ ఖాన్, జూహి చావ్లా. వీరిద్దరూ భాగస్వాములుగా నైట్ రైడర్స్ అనే గ్రూప్ ని 2008లో ప్రారంభించి మొదట IPLలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కొనుగోలు చేశారు.
ఆదాయం పరంగా ఈ జట్టు లాభాల్లో నడుస్తుంది. దీంతో ఇదే స్పూర్తితో నైట్ రైడర్స్ గ్రూప్ 2015లో విండీస్ వేదికగా జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో ట్రిన్బాగో నైట్ రైడర్స్ జట్టు ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. ఈ గ్రూప్ ఇప్పుడు అక్కడ కూడా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. తాజాగా UAE (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) టీ20 లీగ్ జరగుంది. ఈ లీగ్ లో నైట్ రైడర్స్ గ్రూప్ ఓ ఫ్రాంచైజీని దక్కించుకొని దానికి అబుదాబి నైట్ రైడర్స్ (ADKR) అని పేరు పెట్టింది. ఈ విషయాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ అధికారిక ట్విట్టర్ పేజీలో వెల్లడించారు.
త్వరలో USA వేదికగా జరగనున్న ఓ క్రికెట్ లీగ్ లో కూడా షారుక్ ఓ ఫ్రాంచైజీని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలా ఒక పక్క షారుక్ సినిమాలు, యాడ్స్, కొన్ని వ్యాపారాలలో సంపాదిస్తూనే క్రికెట్ లో కూడా భారీగా పెట్టుబడులు పెడుతూ సంపాదిస్తున్నాడు.
Get set for Abu Dhabi Knight Riders! 🤩
🚨 The Knight Riders Group has acquired the rights to own and operate the Abu Dhabi franchise and will set up ADKR as an integral part of the @EmiratesCricket’s flagship UAE T20 league.
More Details: https://t.co/Th3Vlsf1lv pic.twitter.com/qGuRs7DiWX
— KolkataKnightRiders (@KKRiders) May 12, 2022