గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో సమంత, నాగ చైతన్య ల మధ్య విభేదాల అంశం హాట్ టాపిక్ గా మారింది. అసలు వివాదం ఎక్కడ మొదలైందో తెలియదు కానీ సమంత నాగచైతన్య మధ్య విభేదాలు మొదలయ్యాయి అని వీరిద్దరు త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. సాధారణంగా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు నేరుగా ఎవరో ఒకరు స్పందించి అదేమీ నిజం కాదని వాదించే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ వ్యవహారంలో అటు నాగచైతన్య తరపు నుంచి గానీ ఇటు సమంత తరఫు నుంచి కానీ ఎవరూ రంగంలోకి దిగి వార్తలను ఖండించక పోవడంతో ఇది నిజమేనని అందరూ భావిస్తున్నారు.. నిజానికి సమంత సోషల్ మీడియాలో పేరు నుంచి అక్కినేని అనే పదం తీసేయడంతో ఈ ప్రచారం మొదలైందని చెప్పవచ్చు. ఆ తర్వాత సమంత ఈ విషయం గురించి అడిగినా దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆమె తోసిపుచ్చింది కూడా.
తాజాగా ఇప్పుడు సమంత చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కనిపించింది. దర్శనం అనంతరం అక్కడి మీడియా ప్రతినిధులు మాస్క్ తీసి మీడియాతో మాట్లాడాలి అని కోరగా ఇది గుడి మీకు బుద్ధుందా అని ప్రశ్నిస్తూ ముందుకు వెళ్ళి పోయింది సమంత. అయితే సాధారణంగా ఈ విషయం చర్చనీయాంశంగా అయ్యే అవకాశం లేదు. కానీ సమంత గతంలో ఇలా దైవ దర్శనాలకు వచ్చినప్పుడు ఎప్పుడూ ఇంత వైలెంట్ గా ప్రవర్తించలేదని ఎందుకో ఈ రోజు మాత్రమే మీడియా ప్రతినిధుల మీద ఆమె మండిపడ్డారు అని కొందరు అంటున్నారు. అయితే మీడియాతో మాట్లాడితే విడాకుల విషయం ప్రస్తావించాల్సి వస్తోందని ముందే మీడియాతో మాట్లాడకూడదని ఫిక్స్ అయి రావడంతోనే ఆమె అలా ప్రశ్నించి ఉండొచ్చని అని భావిస్తున్నారు.
నిజానికి నాగ చైతన్య, సమంత విడాకుల వార్తలను నేరుగా అక్కినేని ఫ్యామిలీ గానీ, సమంత గానీ కొట్టి పారేయ లేదు. కానీ చిన్న విషయాన్నే మీడియా పెద్దది చేసి చూపిస్తోంది అనే విధంగా మీడియా మీద సామ్ పరోక్షంగా స్పందించింది. నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా ఆయన ప్రమోషన్స్ లో పాల్గొనక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రమోషన్స్ లో పాల్గొనబోయే మీడియా ప్రతినిధులకు సైతం పర్సనల్ ప్రశ్నలు అస్సలు ఆడకూడదు అని యూనిట్ తరఫునుంచి ముందే సూచనలు అందాయట. సామ్ నిన్న కూడా శ్రీకాళహస్తి ఆలయంలో వరుస పూజలు, హోమాల్లో పాల్గొంది. నిన్న మధ్యాహ్నం నుండి శ్రీకాళహస్తి దేవ స్థానంలో సమంత పూజలు నిర్వహించింది అని అంటున్నారు. నిన్న మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేసిన సమంత నర దోషం, గ్రహ దోషం, శత్రు శేషం, దాంపత్య సమస్యలు, ఎదుగుదల, నర దిష్టి రుద్ర హోమం, చండి హోమాలు కూడా చేస్తోందని అంటున్నారు. అయితే ఈ పూజలు దాంపత్య సమస్యల పరిష్కారం కోసమే అనే ప్రచారం జరుగుతోంది. అటు సమంత కానీ నాగచైతన్య కానీ స్పందించకుంటే ఈ ప్రచారానికి బ్రేకులు పడనట్టే.
Also Read : ఎన్టీఆర్ ‘హాట్ సీట్’ లో ఇద్దరు స్టార్ డైరెక్టర్స్.. ఊపిరులూదుతున్నారుగా!