ఎన్టీఆర్ 'హాట్ సీట్' లో ఇద్దరు స్టార్ డైరెక్టర్స్.. ఊపిరులూదుతున్నారుగా!

By iDream Post Sep. 17, 2021, 12:00 pm IST
ఎన్టీఆర్ 'హాట్ సీట్' లో ఇద్దరు స్టార్ డైరెక్టర్స్.. ఊపిరులూదుతున్నారుగా!

కరోనా పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు బుల్లితెర మీద కూడా దృష్టి పెడుతున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న సినిమాలలో నటిస్తున్న ఎన్టీఆర్ లాంటి నటులు కూడా బుల్లితెర షోస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అన్న షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కౌన్ బనేగా కరోడ్ పతి సోనీ నీ ఇన్స్పిరేషన్ గా తీసుకుని గతంలోనే నాలుగు సీజన్లు నడపగా ఇప్పుడు పూర్తిగా పేరు మార్చేసి మరో సీజన్ ప్రారంభించారు. ఈ షో కర్టెన్ రైజర్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్ జెమిని టీవీ కి కాస్త బూస్ట్ ఇచ్చాడు అని చెప్పవచ్చు.. ఒక పక్క ఎన్టీఆర్ మరోపక్క రామ్ చరణ్ లాంటి దిగ్గజాలు హాజరు కావడంతో మొదటి వారానికి జెమినీకి మంచి టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. మిగతా ఛానల్ స్ తో పోలిస్తే తక్కువ రేటింగ్స్ వచ్చినా సరే జెమినీకి అవి ఆనందించదగ్గ రేటింగ్స్ అనే చెప్పాలి

అయితే ఇప్పుడు క్రమంగా వారం వారం ఈ రేటింగ్స్ పెరుగుతూ వెళుతున్నాయి. గత రెండు వారాలుగా చూసినట్లయితే ఎక్కువగా ఈ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్ లు అందరూ ఎన్టీఆర్ కి అభిమానులుగా ఉన్నవారే వస్తున్నారు. వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ తాము ఎన్టీఆర్ అభిమానులము అని చెప్పుకుంటున్నారో లేక నిజంగానే అభిమానులను తీసుకొస్తున్నారో తెలియదు కానీ ఈ వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే రేటింగ్స్ ఇంప్రూవ్ అవుతూ ఉండగా దీనిని మరింత పెంచడానికి ఈ షో నిర్వాహకులు మంచి ప్లాన్ చేశారు. ఈ "ఎవరు మీలో కోటీశ్వరులు" షోకి గెస్టులుగా స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివలు రాబోతున్నారు. తారక్ ముందు హాట్ సీట్‌లో కూర్చొని కలిసి ఆట ఆడబోతున్నారు.

ఈ ఎపిసోడ్ సెప్టెంబర్ 20 సోమవారం నాడు ప్రాసారం కానుందని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ - రాజమౌళి కాంబినేషన్‌లో 'స్టూడెంట్ నంబర్ 1', 'సింహాద్రి', 'యమదొంగ' సినిమాలు రాగా ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి 'ఆర్ఆర్ఆర్' కూడా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా చేయనున్నారు, గతంలోనే వీరి కాంబోలో 'జనతా గ్యారేజ్' సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలా తన ఇద్దరు దర్శకులతో తారక్ షో చేశాడు అంటే వారి అభిమానుల్లోనే కాక సాధారణ ప్రేక్షకులలో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది అని చెప్పక తప్పదు. దీంతో ఒక రకంగా జెమినీ టీవీ మిగతా ఛానల్ లతో పోటీ పడేందుకు ఎన్టీఆర్ ఒక మంచి ఆయుధంగా వాడుకుంటుంది అని చెప్పక తప్పదు.

Also Read : మనోభావాలకు దొరికిన సెన్సిటివ్ దర్శకుడు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp