iDreamPost
android-app
ios-app

ఆర్ఆర్ఆర్ సీతకు అల్లూరి లింక్

  • Published Mar 15, 2020 | 10:33 AM Updated Updated Mar 15, 2020 | 10:33 AM
ఆర్ఆర్ఆర్ సీతకు అల్లూరి లింక్

అప్పుడెప్పుడో 1974లో వచ్చిన కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు సినిమా చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేని ఆణిముత్యం. మన్నెం వీరుడిగా ఆయన్ను మురిపించే స్థాయిలో ఇంకెవరూ మెప్పించలేకపోయారు. కనీసం ఆ పాత్రను ట్రై చేద్దామని ఎన్టీఆర్ లాంటి దిగ్గజాలు సైతం ఆలోచించలేదు. అంతటి ప్రభావం చూపించిన మాస్టర్ పీస్ అది. అందులో రామరాజు ప్రియురాలిగా సీత పాత్రలో నటించిన విజయనిర్మల ఇష్టం లేని పెళ్లి కోసం ప్రాణత్యాగం చేసుకునే సీన్ గొప్పగా పండింది. ఇప్పుడు దీనికి ఆర్ఆర్ఆర్ కి కనెక్షన్ ఏంటనే కదా మీ డౌట్. అక్కడికే వద్దాం.

రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ రామ్ చరణ్ సరసన జోడి కట్టిన సంగతి తెలిసిందే. పూణే షెడ్యూల్ లో తను జాయిన్ కాబోతోంది . అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో అలియా భట్ పోషించే పాత్రకు అల్లూరి సీతారామరాజు తరహాలో ఎండింగ్ ఉంటుందట. కాకపోతే అందులోలా ఆత్మాహుతి కాకుండా రాజమౌళి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడట. ఎలాగూ రామ్ చరణ్ పోషిస్తున్న పాత్ర కూడా అల్లరి సీతారామరాజు ఛాయల్లోనే ఉంటుంది కాబట్టి కథకులు విజయేంద్ర ప్రసాద్ అదే తరహాలో డిజైన్ చేసినట్టు వినికిడి.

ఇద్దరి మధ్య ఎలాంటి కమర్షియల్ డ్యూయెట్ ఉండకపోవచ్చని మరో న్యూస్. ఊహించని రీతిలో పోరాటాలు, మలుపులతో ఉక్కిరిబిక్కిరి చేస్తాం కాబట్టి ప్రత్యేకంగా ఎలాంటి మాస్ అంశాలు వద్దని రాజమౌళి డిసైడ్ అయినట్టుగా చెబుతున్నారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సంబంధించి ప్రతి చిన్న లీక్ పెద్ద ఆసక్తే రేపుతోంది. కీరవాణి సంగీతమే అందిస్తున్న ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది 8న విడుదల కాబోతోంది. ఇప్పటికైతే అధికారికంగా ప్రకటించారు కానీ కరొన దెబ్బలు షూటింగులు వాయిదాలు పడుతున్న నేపథ్యంలో దాని ప్రభావం ఆర్ఆర్ఆర్

మీద ఉంటుందో లేదో చూడాలి. పూణేలో జరగాల్సిన షూట్ కేంద్రం ప్రకటించిన హై అలెర్ట్ వల్ల మార్చుకోవాల్సిన అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbet güncel girişHoliganbet GirişMadridbetMadridbet giriş