iDreamPost
android-app
ios-app

The Warriorr : “ది వారియర్” గా వస్తున్న ఉస్తాద్ రామ్.

  • Published Jan 17, 2022 | 7:14 AM Updated Updated Jan 17, 2022 | 7:14 AM
  • Published Jan 17, 2022 | 7:14 AMUpdated Jan 17, 2022 | 7:14 AM
The Warriorr : “ది వారియర్” గా వస్తున్న ఉస్తాద్ రామ్.

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న #RAPO19 ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ సినిమాకి “ది వారియర్” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. పోస్టర్ చూస్తుంటే రామ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. మొదటి సారి పోలీస్ పాత్రలో చేస్తున్న రామ్ లుక్ కి ఎక్కడ చూసిన బ్రహ్మాండమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇక రామ్ ఫాన్స్ అందరికి ఇది పండగ లాంటి వార్త అని చెప్పొచ్చు.

రామ్ పోతినేని గత ఏడాది మొదట్లో రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాతో వచ్చిన క్రేజ్ ను మరో లెవెల్ కు తీసుకు వెళ్లాలని, నెక్స్ట్ సినిమాతో “అంతకుమించి” బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు.

రామ్ పోతినేనికి ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆయన ఎంతో నమ్మకంతో దర్శకుడు లింగుస్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా కథ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉందని ద్విభాషా సినిమాగా చేయాలని డిసైడ్ అయ్యాడు రామ్.

కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో, టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక గతంలో రామ్ – దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సంచలన మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. జగడం నుంచి హలో గురు ప్రేమ కోసమే వరకు మొత్తం ఆరు సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాల పాటలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు రాబోతున్న ప్రాజెక్ట్ కు రాక్ స్టార్ మ్యూజిక్ హైలైట్ అవ్వనుందని టాక్. రామ్ తొలిసారిగా చేస్తున్న ఈ ద్విభాషా చిత్రం “ది వారియర్” మీద భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read : Acharya & Sarkaru Vaari Paata : ఔను అందుకే వాళ్ళు తేదీలు మార్చుకున్నారు

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabetganobet