iDreamPost
android-app
ios-app

రజినీకాంత్ హృతిక్ రోషన్ కలిసి నటించిన సినిమా తెలుసా? – Nostalgia

  • Published Feb 03, 2020 | 3:37 PM Updated Updated Feb 03, 2020 | 3:37 PM
రజినీకాంత్  హృతిక్ రోషన్ కలిసి నటించిన సినిమా తెలుసా? – Nostalgia

ఇక్కడి ఫోటోలో రజనీకాంత్ ఆప్యాయంగా కౌగిలించుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తు పట్టారా. తను ఎవరో కాదు తన డాన్స్ అండ్ యాక్టింగ్ తో హిందీ సినిమాల్లో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్సిన హృతిక్ రోషన్. బాల్యంలోనే నటన మొదలుపెట్టిన హృతిక్ కు ఆ వయసులోనే రజినితో నటించే అవకాశం దక్కింది. ఆ ముచ్చటే ఇది. 1986లో రజనీకాంత్ టైటిల్ రోల్ లో భగవాన్ దాదా అనే సినిమా వచ్చింది. హృతిక్ నాన్న రాకేష్ రోషన్ నిర్మాత కాగా ఓం ప్రకాష్ దర్శకులు.

క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో బాషా, రెబెల్, యోగి ఛాయల్లో సాగే ఈ మూవీ అప్పట్లో అంచనాలు అందుకోలేక ఫ్లాప్ అయ్యింది. శ్రీదేవి ఇందులో హీరోయిన్. హృతిక్ రోషన్ రజని పెంపుడు కొడుకుగా మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రే చేశాడు. వీళ్ళ ముగ్గురి కాంబోలో మంచి సీన్స్ కూడా ఉంటాయి. అందులోదే పైన మీరు చూస్తున్న స్టిల్. భగవాన్ దాదాకు ముందే హృతిక్ ఆశా, ఆప్కె ధీవానే లో నటించాడు కానీ దీనితోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బ్రేక్ తీసుకుని మళ్ళీ 14 ఏళ్ళ తర్వాత కహో నా ప్యార్ హై తో బాలీవుడ్ దిమ్మదిరిగే డెబ్యూతో రీ ఎంట్రీ ఇచ్చాడు.

తర్వాత రజని హృతిక్ లు స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రాలేదు కానీ భగవాన్ దాదా మాత్రం ఇద్దరికీ మంచి మెమరీగా మిగిలిపోయింది. బహుశా రజని శ్రీదేవిలు ఆ టైంలో హృతిక్ భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడని ఊహించారో లేదో. సినిమా ఆడకపోయినా కానీ పలు ఇంటర్వ్యూలలో దీని గురించిన జ్ఞాపకాలు షేర్ చేసుకునే వాళ్ళు. విశేషమేమిటంటే రజని ఇప్పటికీ హీరోగా కొనసాగుతుండగా హృతిక్ సైతం హిట్లు అందుకుంటూనే ఉన్నాడు. శ్రీదేవి మాత్రం దురదృష్టవశాత్తు కాలం చేశారు కాని మిగిలిన టీంలో చాలా మంది ఇప్పటికీ సజీవంగానే ఉన్నారు.

marsbahis girişjojobet girişjojobetjojobet girişjojobetjojobet girişjojobet girişjojobet giriş