iDreamPost
android-app
ios-app

పాన్ ఇండియా దర్శకుడికి ఆఫర్ల వర్షం

  • Published Oct 11, 2021 | 9:52 AM Updated Updated Oct 11, 2021 | 9:52 AM
పాన్ ఇండియా దర్శకుడికి ఆఫర్ల వర్షం

కెజిఎఫ్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాఫియా బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ సెటప్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే సగం దాకా పూర్తయినట్టు ఇన్ సైడ్ టాక్. ముందు 2022 ఏప్రిల్ రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడది సాధ్యమయ్యే ఛాన్స్ లేదు. అదే స్లాట్ లో కెజిఎఫ్ 2ని ఇదే నిర్మాతలు ప్రకటించారు కాబట్టి సలార్ ని ఏ దసరాకో దీపావళికో షిఫ్ట్ చేయక తప్పదు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ కూడా మూడు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్నట్టు సమాచారం.

ఇదయ్యాక జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ప్రభాస్ తో మరోసారి కాంబో సెట్ చేసేందుకు కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు లేటెస్ట్ న్యూస్. మైత్రి, దిల్ రాజు తదితరులు ఆల్రెడీ క్యూలో ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు ఫిక్స్ అవ్వొచ్చు. సలార్ లో ప్రశాంత్ టేకింగ్ చూసి ఇంప్రెస్ అయిన ప్రభాస్ రెండోసారి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. అదే నిజమైతే నీల్ ఇంకో మూడు నాలుగేళ్లు మనదగ్గరే లాక్ అవుతాడు. ఇప్పటికే శాండిల్ వుడ్ లో ఇతను బయట సినిమాలు చేస్తున్నాడని గుర్రుగా ఉన్నారు. ఇలాంటి బంపర్ ఆఫర్లు వస్తే ఎవరైనా ఇదే చేస్తారుగా.

ప్రశాంత్ నీల్ ఇంతగా ఇక్కడే చేయడానికి ఆసక్తి చూపడానికి కారణం రేంజ్ పరంగా కన్నడ కంటే తెలుగు మార్కెట్ చాలా పెద్దది. ముఖ్యంగా తెలుగులో సరైన బ్లాక్ బస్టర్ పడితే బాలీవుడ్ నిర్మాతలు కూడా వెంటపడతారు. సందీప్ రెడ్డి వంగా, గౌతమ్ తిన్ననూరి, పూరి జగన్నాధ్ అలా అవకాశాలు దక్కించుకున్న వాళ్లే. ఎంత బడ్జెట్ అయినా సరే వీళ్ళ మీద పెట్టేందుకు ప్రొడ్యూసర్లు ముందుకు వస్తున్నారు. కెజిఎఫ్ తర్వాత నీల్ కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేకపోయినా ఆ సక్సెస్ ని కొనసాగించాల్సిన బాధ్యత మాత్రం గట్టిగా ఉంది. అందుకే చాలా ప్లాన్డ్ గా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

Also Read : నెడుముడి వేణు – బహుముఖ ప్రతిభా నటులు

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetsuperbetinMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabetHoliganbetJojobetHoliganbetJojobetHoliganbetJojobet GirişJojobet Giriş