iDreamPost
android-app
ios-app

అనుభవాన్ని రంగరిస్తున్న దిల్ రాజు.. కానీ?

అనుభవాన్ని రంగరిస్తున్న దిల్ రాజు.. కానీ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని ప్రస్తుతం రామ్ చరణ్ 15 అనే పేరుతో సంభోదిస్తున్నారు. సెప్టెంబర్ నెల మొదట్లో అధికారికంగా లాంచ్ అయిన ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్న ట్లు తెలుస్తూ ఉండగా బడ్జెట్ గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు పైనే ఉంటుందని ముందు నుంచి ప్రచారం జరుగుతూ ఉండగా అది నిజం కాదని తాజాగా మరో ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా పూర్తి చేయడానికి గానూ 200 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అని దర్శకుడు శంకర్ నిర్మాత దిల్ రాజుకు కొటేషన్ ఇచ్చారట.

అయితే సినిమా నిర్మాణంలో తల పండిపోయిన దిల్ రాజు 200 కోట్ల రూపాయలు పెట్టడం కరెక్ట్ కాదు అని చెబుతూ దానిని 170 కోట్ల రూపాయలకు తగ్గించాలని తెలుస్తోంది. ఆ 30 కోట్ల రూపాయలు ఎలా తగ్గించాలి అనే విషయాన్ని దిల్ రాజు ఒక ప్లాన్ సిద్ధం చేసి శంకర్ కి ఇచ్చారని అంటున్నారు. నిర్మాతగా తనకున్న అనుభవాన్ని రంగరించి ఈ ముప్పై కోట్ల రూపాయలు తగ్గించినట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దిల్ రాజు 30 కోట్ల రూపాయలు తగ్గించారు అనే విషయం హైలెట్ అవుతున్నా సరే అంత పెట్టడం కూడా రిస్క్ ఏనా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. డైరెక్టర్ శంకర్ మార్కెట్ దృష్ట్యా అంత పెట్టడం కరెక్ట్ కాకపోవచ్చని 170 కోట్ల రూపాయలను రికవరీ చేయడం అనేది మామూలు విషయం కాదని అంటున్నారు.

కానీ నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్ లో కూడా చాలా అనుభవం ఉన్న దిల్ రాజు లెక్కలు వేరుగా ఉన్నాయని ఆయన పెట్టిన ప్రతి పైసా రాబట్టుకునేందుకు ఆయన దగ్గర సరైన ప్రణాళికలు ఉన్నాయని అంటున్నారు. దిల్ రాజు, శిరీష్ కలిసి ఈ సినిమాని తెలుగు తమిళ హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. ఇక ఈ మధ్య విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆసక్తి రేకెత్తించింది. ఈ ఒక్క పోస్టర్ కి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతున్నా సరే ఇందులో నిజానిజాలు ఎంత అనేదాని మీద క్లారిటీ అయితే లేదు. ఇక ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతుండగా అంజలి, సునీల్, జైరాం వంటి వాళ్లు కీలక పాత్రలో నటిస్తున్నట్లు గా పోస్టర్ ద్వారా క్లారిటీ వచ్చింది.

Also Read : లవ్ స్టోరీ టార్గెట్ అప్పుడే అయిపోలేదు

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş