iDreamPost
iDreamPost
ఏ బాషా పరిశ్రమలో అయినా ఇప్పుడంతా రీమేకుల ట్రెండ్ నడుస్తోంది. ఎలాంటి రిస్క్ లేకుండా సేఫ్ గేమ్ ఆడే అవకాశం ఉండటంతో పాటు స్క్రిప్ట్ విషయంలో మరీ ఇబ్బందులు పడే అవసరం ఉండదు. అందుకే అన్నిచోట్లా ఈ ఫార్ములా వాడుతున్నారు. ఇక బాలీవుడ్ లో ఏకంగా పది దాకా రీమేకులు లైన్ లో ఉండటం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. ట్విస్ట్ ఏంటంటే ఇవన్నీ దాదాపుగా యుట్యూబ్ ఛానల్స్ లో డబ్బింగ్ రూపంలో ఉన్నవే. అయినా కూడా నార్త్ ఆడియన్స్ మళ్ళీ ఇవే కథలను థియేటర్లో చూస్తారన్న నమ్మకంతో దర్శక నిర్మాతలు సిద్ధపడుతున్నారు. ఒకసారి వాటి మీద లుక్ వేస్తే మీకే ఆశ్చర్యం కలగక మానదు
విక్రమ్ ‘అపరిచితుడు’ని రణ్వీర్ సింగ్ తో దర్శకుడు శంకర్ మళ్ళీ హిందీలో తీయబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ప్రాజెక్ట్ అవ్వగానే దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్తారు. సంక్రాంతికి వచ్చిన రామ్ ‘రెడ్’ని ఆదిత్య రాయ్ కపూర్ తో చేయబోతున్నారు. బెల్లంకొండ ‘రాక్షసుడు’ని అక్షయ్ కుమార్ తో తీసే ప్రతిపాదనలు దాదాపు కొలిక్కి వచ్చాయి. మలయాళంలో సెన్సేషన్ సృష్టించిన ‘హెలెన్’ని జాన్వీ కపూర్ తో తీసేందుకు రంగం సిద్ధమయ్యింది. ఇది తెలుగులోనూ వస్తుంది. ‘విక్రమ్ వేదా’ని హృతిక్ సైఫ్ కాంబోలో ఆల్రెడీ లాక్ చేశారు. ‘ఆకాశం నీ హద్దురా’ రీమేక్ లో అక్షయ్ కుమార్ నటించడం లాంచనమేనని ముంబై టాక్
జయం రవి నటించిన ‘కోమలి’ని అర్జున్ కపూర్ తో తీయబోతున్నారు. విజయ్ ‘మాస్టర్’ సల్మాన్ ఖాన్ చేయడం ఆల్మోస్ట్ ఖాయమే. ‘ఖైదీ’ రీమేక్ కు అజయ్ దేవగన్ ఇప్పటికే కమిటైపోయాడు. ఇవి కాకుండా ‘ఛత్రపతి’ని మన సాయి శ్రీనివాసే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా రీమేకుల వర్షంలో బాలీవుడ్ తడిసి ముద్దవుతోంది. ఇవి కాకుండా మరికొన్ని కూడా ప్రపోజల్ స్టేజి లో ఉన్నాయి. రవితేజ క్రాక్, ఉప్పెనలు డీల్ క్లోజ్ చేసుకునే దశలో చర్చలు జరుగుతున్నాయి. తమిళ తెలుగు సినిమాల మీద అక్కడి నిర్మాతలు రెగ్యులర్ గా కన్నేసి మరీ హక్కులు కొనేస్తున్నారు. కథల కొరత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంత కన్నా వేరే ఉదాహరణ కావాలా
Also Read: అసురన్‌ని “నారప్ప” అందుకున్నాడా?