iDreamPost
android-app
ios-app

బయటికొస్తున్నారా ఒక్క నిమిషం ఆలోచించండి

బయటికొస్తున్నారా ఒక్క నిమిషం ఆలోచించండి

బయటకి రావద్దు లాక్ డౌన్ పాటించండి ఎంత మర్యాదగా , జాగ్రత్తగా చెప్పినా ఇంకా కొందరు వినడంలేదు , రక్షణ చర్యలు పాటించడం లేదు . అత్యవసరం కాకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించి వారి జీవితాల్ని పణంగా పెట్టటంతో పాటు ప్రజాశ్రేయస్సు కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న వివిధ రంగాల సిబ్బందిని కూడా కష్టాల పాలు చేస్తున్నారు .

కరోనా ప్రభావం ఏంటో దుష్పరిణామాలు ఎలా ఉంటాయో మీకు పూర్తిగా తెలుసా???
చెబుతాను వినండి….

కరోనాపై అసలు విషయం చెప్పి మిమ్మల్ని ప్యానిక్ చేయాల్సిందే… కాదు కాదు మీరు ప్యానిక్ అవ్వాల్సిందే తప్పదు……

నువ్వు పీల్చేది మాములు గాలి కాదు…
నువ్వు పట్టుకున్నవన్ని శుద్దమైన వస్తువులు కాదు…
నీ చుట్టు ఉన్నవారంతా ఆరోగ్యవంతులు కాదు..
నీ కంటికి కనబడేదంతా నిజం కాదు…

ఇప్పటివరకు కరోనా వచ్చినవాళ్లంతా, వారి పక్కింటివారు, వీధిలోని వారు, ఏరియా వాళ్లు మీలానే ఆలోచించారు , కరోనా నాకు దగ్గరగా లేదుగా అని….

మిల్లి సెకెన్ లో అంటుకోవడానికి నీ చుట్టూ కరోనా వైరస్ రెడీగా ఉంది…

ఏమీ అవ్వదు అనుకుంటే నువ్వు , నీ కుటుంబం ,నీ బంధువులు, నీ స్నేహితులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే…

మనకంటే ఎంతో ఎంతెంతో డెవలప్‌ అయిన దేశాల్లో కరోనా కారణంగా మరణమృదంగం మోగుతోంది….
సామాన్యుల నుండి అద్యక్షులు, అపరకోటీశ్వరులు, సెలబ్రెటీలు, వీఐపీలు అందరూ కరోనా బారిన పడ్డారు….

కరోనా వస్తే ఏమౌతుంది… జస్ట్ జ్వరం, దగ్గు అంతేగా , సీజనల్ వ్యాదిలాగా నాలుగురోజులు ఉండి పోతుంది అనుకోకండి. ఎడతెరపి లేని దగ్గు దగ్గి దగ్గి దగ్గి ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్…. ఊపిరి తీసుకోవడం కష్టం… ఆ దగ్గు వల్ల లంగ్స్ దెబ్బతింటాయి , లివర్ ఇన్ఫెక్షన్ వస్తుంది , గుండె ఆగిపోతుంది .

బ్రతకాలి అనే కోరిక తప్ప ఎవరూ ఏం చేయలేరు , దగ్గు, జ్వరం విపరీతంగా ఉన్నా కూడా దాన్ని తట్టుకోగలినవాళ్లు తప్ప ఎవరూ బ్రతకరు…( ఇమ్యూనిటీ పవర్ బాగా ఉన్నవారికే కొంత బ్రతికే అవకాశాలు ఉంటాయి ) నువ్వు హాస్పటల్ లో ఉంటే నీ కన్న తల్లి , తండ్రి.., కొడుకు , కూతురు ,భార్య , భర్త , అన్న , తమ్ముడు , అక్కా , చెల్లీ ఇలా నా అన్నవారిని ఎవరినీ కలవలేవు , కలవనివ్వరు , కలిస్తే వారు కూడా ప్రమాదంలో పడతారు.

పదే పదే దగ్గేటప్పుడు , తుమ్మేటప్పుడు ఎందుకు పుట్టానురా అనుకుంటావ్ ,ఈ దగ్గు, జలుబు భరించేకన్నా పోతే బాగుండు అనిపిస్తుంది.. కాని పోలేవ్ . కాపాడండి డాక్టర్ అని అరిచి గీపెట్టినా దైర్యం చెప్పడం తప్ప ఏం చేయలేరు…

మనం పోతే కనీసం బాడీని కూడా ఇంటికి పంపరు… కనీసం మిగిలిన బూడిద కూడా ఇవ్వరు….

కుక్కచావు అంటాం కదా దాని కంటే దారుణంగా ఉంటుంది చావు ..
అవసరమా…. మనకి అవసరమా…???
ఎందుకు నిర్లక్ష్యం, ఎందుకు ధీమా..
ప్రాణం అంటే ఎవరికి తీపి ఉండదు… అనవసరంగా మన, మనవాళ్ల ప్రాణాలు తీసుకుందామా…??

వీలైనంత వరకూ బయటికి రాకుండా ఉండడం , తప్పనిసరై బయటివస్తే మొహానికి ఖర్చీఫ్ , బయటవారికి దూరం, చేతులు శుభ్రపరుచుకోవడం , మొహానికి చేతులు తాకకుండా జాగ్రత్త పడడం వ్యక్తిగత శుభ్రత….. ఇంతే ఇవే జాగ్రత్తలు కేవలం
80% కరోనా నీ దరికి చేరకుండా ఉంటుంది…

అత్యవసరం అయితేనే బయటకి రండి. ఆరోగ్య శాఖ వారి సూచనలు పాటించండి . మనం బ్రతికి ఉంటేనేగా మన ఇంట్లోవాళ్లు సుఖంగా ఉండగలరు…

పోతే పోయింది ఓ నెల…..
మహా అయితే కోలుకోవడానికి, కష్టాన్ని, నష్టాన్ని పూడ్చుకోవడానికి ఒక నెలో, ఏడాదో పడుతుంది..
భరిద్దాం. జీవితాన్ని కోల్పోవడం కన్నా జీవితంలో
ఒక నెల కోల్పోవడం బెటరే కదా….

ఆలోచించండి .. అత్యవసరమైతే తప్ప దయచేసి బయటకి రాకండి . వస్తే అన్ని జాగ్రత్తలు పాటించండి. మీ కుటుంబానికి రేపటిని సంతోషంగా ప్రారంభించే అవకాశాన్ని ఇవ్వండి .

Written By -Madhavi

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet güncel girişjojobet giriş