iDreamPost
android-app
ios-app

జనసేనకు కొత్త కళ – సీఎం తరహా కాన్వాయ్ లు

జనసేనకు కొత్త కళ – సీఎం తరహా కాన్వాయ్ లు

సాధారణంగా సీఎం హోదాలో ఉండే వ్యక్తికి కాన్వాయ్ లు ఉంటాయి. కానీ అదే తీరులో కాన్వాయ్  లను సిద్ధం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. 8 కాన్వాయ్ లు ఇప్పుడు జనసేన అధినేత దగ్గర హల్ చల్ చేస్తున్నాయి.

వీటి కోసం సుమారు కోటిన్నర వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులు ఎవరైనా ఒక కార్ లో వెళ్తారు. అనుచరులు, ఇతర పార్టీ సభ్యులు వెనుక ఎన్ని కార్లలో అయినా రావొచ్చు. కొన్నిసార్లు ప్రత్యేకంగా కారవాన్ వాడతారు. వీటన్నిటికీ భిన్నంగా పవన్ ఒక సీఎం తరాహలో 8 స్కార్పియో కాన్వాయ్ లను రెడీ చేశారు.

ఇదంతా చూస్తుంటే, రాబోయే 6 నెలలు పవన్ తన టూర్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా గడుపుతున్న పవన్, రెండిటినీ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.