iDreamPost
android-app
ios-app

ఆచార్యకు భలే కలిసొచ్చింది

  • Published Mar 16, 2020 | 5:51 AM Updated Updated Mar 16, 2020 | 5:51 AM
  • Published Mar 16, 2020 | 5:51 AMUpdated Mar 16, 2020 | 5:51 AM
ఆచార్యకు భలే కలిసొచ్చింది

ఒక్కోసారి అనుకోని అవాంతరాలు పెద్ద ప్లస్ గా మారతాయి. అలాంటిదే ఆచార్యకూ జరిగింది. మూడు రోజుల క్రితం క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా తాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు ట్విట్టర్ లో త్రిష ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఎవరా అనే వేటలో కొరటాల శివ బిజీగా ఉన్నాడు. ఇక్కడ కలిసివచ్చిన అంశం సినిమా పరిశ్రమ మొత్తం కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా షూటింగులను రద్దు చేయడం. అందరి కంటే ముందు చిరు ఈ పని చేసినప్పటికీ ఇప్పుడు ఇండస్ట్రీనే ఆ నిర్ణయం తీసుకుంది కాబట్టి కేవలం ఆచార్య టీమ్ మాత్రమే ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు.

ఇప్పుడు ఈ టైం హీరోయిన్ సెలక్షన్ కు వాడుకోవడానికి ఉపయోగపడుతోంది. తాజాగా కాజల్ అగర్వాల్ పేరు వినిపిస్తోంది కానీ రెమ్యునరేషన్ దగ్గర ఏవో డిస్కషన్స్ వల్ల ఇంకా ఫిక్స్ అవ్వలేదని టాక్ వస్తోంది. మరోవైపు అనుష్క పేరు కూడా వినిపిస్తోంది కానీ స్వీటీ అంత ఈజీగా కన్విన్స్ కాకపోవచ్చు. ఇక తర్వాత లిస్ట్ లో తమన్నా ఉంది. అయితే ఆల్రెడీ సైరాలో చేసింది కాబట్టి తనను పరిగణనలోకి తీసుకోవడం అనుమానమే. ఈషా రెబ్బ పేరు పరిశీలనలో ఉన్నట్టు మరో న్యూస్ ఉంది కానీ చిరంజీవి పక్కన జోడిగా తను ఎంతవరకు సూట్ అవుతుందనే అనుమానాలు సహజం.

అందులోనూ తనకు పేరున్న స్టార్ హీరోలతో చేసిన ట్రాక్ రికార్డు లేదు. మెహ్రీన్ ని కూడా అడిగి చూస్తారట. చిరుకి జోడిగా తనూ సెట్ అవ్వడం కొంత డౌటే. అందులోనూ కుర్ర హీరోయిన్లు నిన్నటి తరం స్టార్లతో నటించేందుకు అంతగా ఇష్టపడటం లేదు. ఈ సమస్య కారణంగానే బాలయ్య ప్రతి సినిమాకు కథానాయికలను పట్టుకోవడం పెద్ద సవాల్ గా మారింది. ఏదైతేనేం కరోనా వల్ల షూటింగ్ వాయిదా పడిన ఆచార్యకు హీరోయిన్ ఎంపికతో పాటు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కీలక పాత్రకు సంబంధించి ఎవరిని ఫైనల్ చేయాలో లాంటి విషయాలకు టైం దొరుకుతుంది. కాకపొతే ఇప్పుడీ షెడ్యూల్స్ డిస్టర్బ్ కావడం వల్ల రిలీజ్ టార్గెట్ చేసుకున్న దసరాని మీట్ అవ్వగలరో లేదో చూడాలి.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet