iDreamPost
android-app
ios-app

Sarkaru Vaari Paata Day 1 Box Office Collection సర్కారు వారి పాట మొదటి రోజు వసూళ్లు

  • Published May 13, 2022 | 1:32 PM Updated Updated May 13, 2022 | 1:32 PM
Sarkaru Vaari Paata Day 1 Box Office Collection సర్కారు వారి పాట మొదటి రోజు వసూళ్లు

నిన్న మిక్స్డ్ టాక్ మధ్య మొదలైన సర్కారు వారి పాట ఓపెనింగ్ గ్రాండ్ గానే అందుకుంది. వచ్చిన ఫిగర్లు, నమోదవుతున్న ఆక్యుపెన్సీ మీద పలు అనుమానాలు ఉన్నప్పటికీ ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇది నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు అందుకుందట. వాస్తవానికి ఏ సినిమా అయినా బాక్సాఫీస్ లెక్కలకు సంబంధించి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ ఉండటం లేదు. నిర్మాతలు పోస్టర్లు వదులుతూ ఉంటారు. అయితే ఏరియా వారిగా ఖచ్చితంగా ఇంత వచ్చిందని చెప్పడానికి సరైన ఆధారాలు ఎవరూ చూపించలేరు. అయినా ఈ మూవీకే ప్రత్యేకంగా ఎత్తి చూపలేం కానీ ఇది అందరూ చేస్తున్నదే.

టికెట్ రేట్ల ప్రభావం గట్టిగా ఉందన్న వాస్తవాన్ని ఒప్పుకుని తీరాలి. ముఖ్యంగా బిసి సెంటర్లతో పాటు కొన్ని ఏ కేంద్రాల్లో బెనిఫిట్ షోలు ఫుల్ కాలేదు. ధరలు మరీ విపరీతంగా ఉండటం ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం చేస్తోంది. కేవలం ఏడాది కాలంలోనే వంద నుంచి రెండు వందల దాకా పెరిగిపోవడాన్ని సాధారణ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మాస్ సైతం వీటి దెబ్బకే రిపీట్లు చూడటం తగ్గించేశారు. ఈ ఎఫెక్ట్ వీకెండ్ అయ్యాక మరింత తీవ్రంగా ఉండబోతోంది. ఈ అనుభవాల దృష్ట్యా ఇకపై టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు అలోచించి నిర్ణయం తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక వసూళ్లు చూద్దాం

ప్రొడక్షన్ హౌస్ ఇచ్చిన ఇన్ఫో ప్రకారం

నైజామ్ – 12 కోట్ల 24 లక్షలు
సీడెడ్ – 4 కోట్ల 70 లక్షలు
ఉత్తరాంధ్ర – 3 కోట్ల 73 లక్షలు
ఈస్ట్ గోదావరి – 3 కోట్ల 25 లక్షలు
వెస్ట్ గోదావరి – 3 కోట్లు
గుంటూరు – 5 కోట్ల 83 లక్షలు
కృష్ణా – 2 కోట్ల 58 లక్షలు
నెల్లూరు – 1 కోటి 56 లక్షలు

యూనిట్ అధికారికంగా చెబుతున్న దాన్ని బట్టి ఏపి తెలంగాణలోనే మొదటి రోజు 36 కోట్ల 89 లక్షలు ఉండటం గమనార్హం. కానీ థియేటర్ల దగ్గర చూస్తున్న ట్రెండ్ కు దీనికి కొంత వ్యత్యాసం ఉంది. దీనిని గురించే సోషల్ మీడియాలో హీరోల ఫ్యాన్స్ గట్టిగా చర్చించుకుంటున్నారు. ఓవర్సీస్ లో ఒక మిలియన్ దాటేసిన సర్కారు అక్కడ మంచి పెర్ఫార్మన్స్ చూపిస్తోంది. ఫస్ట్ డే నాన్ ఆర్ఆర్ఆర్ అంటున్నారు కానీ ఫైనల్ గా ఆ స్థాయికి చేరుకోవడం అనుమానమే. ఇప్పుడున్న టాక్ ని తట్టుకుని వీకెండ్ లో భీభత్సమైన వసూళ్లు దక్కించుకుంటేనే సర్కారు వారి పాట అడుగు బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుంది. చూడాలి మరి ఏం చేయనుందో

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişBetboo girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel