iDreamPost
android-app
ios-app

RRR Pre Release Event : అక్కడ సరే ఇక్కడ ఈవెంట్ మాటేమిటి

  • Published Mar 16, 2022 | 2:20 PM Updated Updated Mar 16, 2022 | 2:20 PM
RRR Pre Release Event : అక్కడ సరే ఇక్కడ ఈవెంట్ మాటేమిటి

ఇంకో ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ కౌంట్ డౌన్ షురూ అయ్యింది. థియేటర్ల దగ్గర ఏర్పాట్లు చేయడంలో అభిమానులు తలమునకలై ఉన్నారు. బ్యానర్లు పూలదండలు వగైరా డెకరేషన్లు సిద్ధమవుతున్నాయి. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ పోటీ పడి మరీ నువ్వా నేనా అనే రీతిలో తారక్ చరణ్ లకు స్వాగతం చెప్పేందుకు రెడీ అయ్యారు. మరోవైపు రాజమౌళి టీమ్ ఫ్రెష్ గా ఇంటర్వ్యూలు ప్రమోషన్లు మొదలుపెట్టింది. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో పాత విషయాలే కొత్తగా చెప్పడం మీడియాలో బాగా హై లైట్ అయ్యింది. జక్కన్న దగ్గరుండి మరీ రామరాజు భీమ్ లతో వరుసబెట్టి ప్రోగ్రాంలు అరేంజ్ చేస్తున్నారు. ఇవి ఇంకా రాబోతున్నాయి.

ఎల్లుండి 18న బెంగళూరు దగ్గరలో కల చిక్ బళ్లాపూర్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, హోమ్ మినిస్టర్ తో పాటు శివ రాజ్ కుమార్ లాంటి విశిష్ట అతిధులు హాజరు కాబోతున్నారు. పునీత్ కు ఈ వేడుకను అంకితం ఇవ్వనున్నారు. చిరంజీవి వెళ్లే అవకాశాలు లేనట్టే. ఇంకేమైనా సర్ ప్రైజ్ లు ఉన్నాయేమో ఆ రోజు చూడాల్సిందే.ఇప్పటికే పాసుల కోసం ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి మొదలైంది. తెలుగులో ఈవెంట్ చేసే సూచనలు లేకపోవడంతో చిక్ బళ్లాపూర్ వెళ్లేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. సోషల్ మీడియాలో దీని తాలుకు ట్వీట్ లు పోస్టులు ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి.

ప్రీమియర్లు 24 కన్ఫర్మ్ అయినట్టే. రాజమౌళి స్వయంగా చెప్పేశారు. డిస్ట్రిబ్యూటర్లు దానికి సిద్ధపడితే మేము అడ్డుపడం అని స్పష్టత ఇచ్చేశారు కాబట్టి సంబరాలకు రంగం సిద్ధమైనట్టే. ట్రైలర్ తో మొదలుపెట్టి పబ్లిసిటీ దాకా అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ మోస్తున్న ఆర్ఆర్ఆర్ కు మినిమమ్ పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. కనీసం మూడు నాలుగు రోజుల పాటు రోజుకు వంద కోట్ల గ్రాస్ గ్యారెంటీ అనే కోణంలో విశ్లేషణలు వినపడుతున్నాయి. ఎలాగూ పెద్దగా పోటీ లేదు కాబట్టి సోలో గ్రౌండ్ ని చరణ్ తారక్ లు పూర్తిగా వాడుకోవచ్చు. సో ఇంకొక్క వారంలో ఇండియా బిగ్గెస్ట్ గ్రాండియర్ ని తెరమీద చూడబోతున్నాం

Also Read : The Kashmir Files : బాక్సాఫీస్ వద్ద ఊహించని పరిణామాలు

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel