టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని తర్వలోనే సినిమాల్లోకి రాబోతున్నారు. నటుడిగా మాత్రం కాదు, నిర్మాతగా. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా. నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో నిర్మించబోయే సినిమాకు, ధోని నిర్మాత. పవర్ ఫుల్ సబ్జెక్ట్ తోపాటు, ధోని నిర్మాతగా చేయనుండటంతో నయన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దర్శకుడిని త్వరలో ప్రకటించనునున్నారు. అట్లీ షారుఖ్ తో అట్లీ తీస్తున్న లయన్ (Lion)తో నయన్ బాగా బీజీ.
సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టాన్నది ధోనీ కోరిక. ఆమేరకు రెండేళ్ల నుంచి ప్రయత్నాల్లో ఉన్నాడు. దానికోసం రజనీకాంత్ (Superstar Rajinikanth) సన్నిహితుడు సంజయ్ ని భాగస్వామిగా ఎంచుకున్నారు. నయనతారతో సినిమాతీస్తే సౌత్ ఇండియాలో గట్టిగా ఓపెనింగ్స్ ఉంటాయని అనుకున్నట్లు సమాచారం. షారూఖ్ సినిమాకూడా హిట్ కొడితే, నార్త్ లోకూడా నయనతార పాపులర్ అవుతుంది. ఇదికూడా సినిమాకు అదనపు బలం.
జూన్ 9న డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను నయనతార పెళ్లిచేసుకోనున్నారు. ఆ తర్వాత హానీమూన్ .ఈలోగా ఐపీఎల్ ముగిసిపోతుంది. తర్వాత ధోని, నయన్ కలిసి ఈ సినిమాను పట్టాలెక్కించనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే కీలక అప్డేట్ వచ్చే అవకాశమున్నట్టు కోలివుడ్ వర్గాలు చెబుతున్నాయి.