iDreamPost
android-app
ios-app

KGF Chapter 2 : కెజిఎఫ్ 2కు ఎదురవుతున్న సవాళ్లు

  • Published Mar 28, 2022 | 3:07 PM Updated Updated Mar 28, 2022 | 3:07 PM
KGF Chapter 2 : కెజిఎఫ్ 2కు ఎదురవుతున్న సవాళ్లు

నిన్న సాయంత్రం బెంగళూరు వేదికగా కెజిఎఫ్ 2 ట్రైలర్ లాంచ్ చాలా గ్రాండ్ గా జరిగింది. దేశవ్యాప్తంగా మీడియాని ప్రత్యేకంగా పిలిపించి హోంబాలే ఫిలిమ్స్ ఈ వేడుకను చేశారు. ఈవెంట్ వినడానికి చిన్నదే అనిపించినా భారీగా ఖర్చు పెట్టారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. సంజయ్ దత్ తో పాటు కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మూడేళ్ళ క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా రూపొందిన కెజిఎఫ్ 2 విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీజర్ రేంజ్ లో లేదని యష్ క్యారెక్టర్ కు సంబంధించి చాలా ఎక్స్ పెక్ట్ చేశామని పలురకాలుగా చెబుతున్నారు.

ఇవన్ని ఎలా ఉన్నా ట్రైలర్ మాత్రం హైప్ తెచ్చేందుకు సరిపడా ఉంది. ఫస్ట్ పార్ట్ కి పదింతలు హై వోల్టేజ్ యాక్షన్ ఇందులో ఉంటుందని గతంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పిన మాటల్లో అతిశయోక్తి లేదనిపించింది. అయితే ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్న కారణంగా వీడియో మీద డివైడ్ టాక్ వచ్చి ఉండొచ్చు కానీ కేవలం ఆ కారణంగా రాఖీ భాయ్ ని తక్కువ చేసి చూడలేం. సంజు బాబాతో పాటు రవీనాటండన్ కు చాలా కీలకమైన పాత్ర దక్కింది. మొదటి భాగంలో కెజిఎఫ్ కథను చెప్పిన అనంత్ నాగ్ స్థానంలో ప్రకాష్ రాజ్ రావడం కొత్త ట్విస్టు. పెద్దాయన అందుబాటులో ఉన్నా కారణాలేవో బయటికి చెప్పడం లేదు

ఆర్ఆర్ఆర్ దేశవ్యాప్తంగా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో కెజిఎఫ్ 2 మీద అమాంతం అంచనాల బరువు పెరిగిపోయింది. ఒక రోజు ముందు విజయ్ బీస్ట్ రిలీజ్ కావడం సౌత్ మార్కెట్ లో యష్ సినిమా మీద ప్రభావం చూపించడం ఖాయం. ముఖ్యంగా తమిళనాడు రెవిన్యూ బాగా ఎఫెక్ట్ అవుతుంది. రెండు సినిమాలు పోటీ పడేందుకు ఇది ఎలక్షన్ కాదని సీనియర్ హీరో అయిన విజయ్ మీద గౌరవం ఉందని యష్ చెప్పినప్పటికీ ట్విట్టర్ లో మాత్రం అప్పుడే ఫ్యాన్ వార్ మొదలయ్యింది. కెజిఎఫ్ 2కి జరిగిన బిజినెస్ తాలూకు డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. తెలుగులో కూడా చాలా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు

Also Read : Abhishek Bachchan : వారసత్వం వస్తే సరిపోదు నిలబెట్టుకోవాలి

Jojobet GirişMadridbetMariobetmeritbetcasibom girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetcasibom girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş