iDreamPost
android-app
ios-app

చిరు సినిమాకు మహేష్ లెక్క

  • Published Feb 29, 2020 | 1:59 PM Updated Updated Feb 29, 2020 | 1:59 PM
చిరు సినిమాకు మహేష్ లెక్క

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యాడ్ షూట్ కోసం మహేష్ ముంబైలో ఉన్నాడు. తిరిగి హైదరాబాద్ కు రాగానే దీనికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. ఈ ఇద్దరు హీరోల కాంపౌండ్ నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు చిరు మహేష్ ఒకే సినిమాలో నటించడం దాదాపు ఖరారైనట్టే. అయితే ఇప్పుడు మరో న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

దాని ప్రకారం ఈ సినిమా కోసం మహేష్ మొత్తం 30 రోజులు కాల్ షీట్స్ ఇవ్వబోతున్నాడు. రెమ్యునరేషన్ కూడా రోజుకు కోటి అట. అంటే ముప్పై నిమిషాల పాత్రకు అక్షరాలా ముప్పై కోట్లు తీసుకోబోతున్నట్టు లెక్క. మహేష్ ఫుల్ సినిమాకు తీసుకునే దాంట్లో ఇది అరవై శాతం కన్నా ఎక్కువ. ఈ లెక్కన మహేష్ బాబు పాత్ర ఇందులో ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందోనన్న అంచనాలు అప్పుడే మొదలైపోయాయి. మరి మెగాస్టార్ సినిమాలో క్యామియోకు ఒక్క మహేష్ కే అంత పారితోషికం ఇస్తే వర్కవుట్ అవుతుందా అనే అనుమానం రావడం సహజం. కానీ నిర్మాతల లెక్క వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది.

చిరంజీవి సినిమా ప్రస్తుత మార్కెట్ ప్రకారం పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా వంద కోట్లు రాబడుతోంది. ఇప్పుడు మహేష్ తోడయ్యాడు కాబట్టి ఎంత లేదన్న 20 నుంచి 30 కోట్ల దాకా బిజినెస్ లోనూ, వసూళ్లలనూ పెరుగుదల ఉంటుంది. ఈ లెక్కన ఆ రెమ్యునరేషన్ పూర్తిగా గిట్టుబాటు అయ్యేదే. ఇదంతా నిజమో కాదో చెప్పలేం కానీ ప్రస్తుతానికి ఈ హాట్ టాపిక్ గురించే పరిశ్రమ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ కన్నా చాలా ముందు వచ్చే ఈ ఆచార్య అల వైకుంఠపురములో రికార్డులను బ్రేక్ చేస్తుందన్న అంచనాలు అప్పడే ట్రేడ్ లో మొదలయ్యాయి

marsbahis girişgamdom girişjojobet girişjojobet girişsiteye gitJojobet Giriş