iDreamPost
android-app
ios-app

ముఖ్యమంత్రి పీఠం దిశగా కేజ్రీవాల్

ముఖ్యమంత్రి పీఠం దిశగా కేజ్రీవాల్

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) దూసుకెళుతోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం నుంచీ ఆప్‌ స్పష్టమైన ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం మొత్తం 70 స్థానాల్లో రెండు మూడు రౌండ్లు ముగిసే నాటికి మొత్తం 70 స్థానాలకు గాను ఆప్‌ అభ్యర్థులు 53 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరో ప్రధాన పక్షం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు మాత్రం కేవలం ఒకే ఒక్క స్థానంలో గట్టి పోటీ ఇస్తుంది. 27 స్థానాల్లో మాత్రం ఆప్ బిజెపి మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్నట్టు తెలుస్తుంది.

కడపటి వార్తలు అండ్ సమయానికి ఆప్ 50.92 %, బిజెపి 42.48%, కాంగ్రెస్ పార్టీ 4.57%, ఇతరులు 2.02% ఓటు షేరింగ్ సొంతం చేసుకున్నారు. సౌత్ ఢిల్లీలోని మొత్తం 10 స్థానాల్లో ఆప్ -6 బిజెపి -4 స్థానాల్లో ముందుంది. చాందిని చౌక్ లో మొత్తం 10 స్థానాల్లో ఆప్ -6 బిజెపి -4 స్థానాల్లో ముందుంది.

Read Also: ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్

2015 ఎన్నికల్లో ఆప్‌ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. సాధారణ ఎన్నికలు జరిగిన ఏడాది లోపే ఢిల్లీ శాసన సభకు ఎన్నికలు జరగ్గా ఆప్‌ 67 స్థానాలతో విజయదుందుభి మోగిచింది. లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు విజయం సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో మాత్రం కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. ఇక ఆప్పటి వరకు దాదాపు 15 ఏళ్లపాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్‌ బోణి కూడా కొట్టలేదు.

ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తుంటే ఆప్‌ అధినేత అర్వింద్‌ కేజ్రీవాల్‌ మంచి ఆధిక్యత తో వరుసగా మూడో సారి సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు . 2013లో కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్‌.. ఒడిదుడుకుల పాలన చేశారు. ఈ నేపథ్యంలో ఏడాదిన్నరలోపే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. 2015 ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకుని ఎవరీ అందనంత ఎత్తులో నిలిచారు. తాజాగా ఈ ఎన్నికల్లో ఆప్‌ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇంకొద్దిసేపట్లో ఫలితాల సరళి వెల్లడికానుంది.

jojobet girişmarsbahisJojobet GirişJojobet GirişCasibomcasibom girişholiganbettaraftarium24madridbet girişmadridbet girişmadridbetJojobet Girişkatla