iDreamPost
android-app
ios-app

చిరంజీవి డబుల్ బొనాంజా ఇస్తారా

  • Published Jul 26, 2021 | 6:20 AM Updated Updated Jul 26, 2021 | 6:20 AM
చిరంజీవి డబుల్ బొనాంజా ఇస్తారా

ఆచార్యకు ఇంకొద్ది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు. పరిస్థితిని బట్టి విడుదల సెప్టెంబరా లేక అక్టోబరా అనేది డిసైడ్ చేస్తారు కానీ ఈలోగా చిరంజీవి తన కొత్త సినిమాలకు బ్రేక్ ఇచ్చే మూడ్ లో లేరు. వచ్చే నెల నుంచే లూసిఫర్ రీమేక్ రెగ్యులర్ షూట్ ప్రారంభం కాబోతోంది. దర్శకుడు మోహన్ రాజా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన పనులన్నీ పూర్తి చేశారు. తమన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సెట్లు వేస్తున్నారు. ఇంకా క్యాస్టింగ్ ని అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ అవన్నీ స్వీట్ సర్ప్రైజ్ గా ఉండబోతున్నట్టు తెలిసింది. వీలైనంత వేగంగా షూట్ ని పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు.

దీని తర్వాత బాబీ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే భారీ ఎంటర్ టైనర్ ఉంటుంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో చిరంజీవి తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేయబోతున్నారని వినికిడి. ఈ తరహా క్యారెక్టర్లు మెగాస్టార్ చేసి పదిహేనేళ్ళు దాటింది. 2005లో శ్రీను వైట్ల తీసిన అందరివాడులో ఇలా కనిపించారు. దానికన్నా ముందు 1999లో స్నేహం కోసంలో తండ్రి కొడుకులుగా నటించారు. పూర్తి వెనక్కు వెళ్తే సింహపురి సింహం, రిక్షావోడు లాంటివి ఉన్నాయి. అయితే తండ్రి కొడుకుల కన్నా అన్నదమ్ములుగా నటించిన డ్యూయల్ రోల్ సినిమాలే చిరంజీవికి ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్లకు చేయబోతున్నారన్న మాట.

ఈ వార్త అధికారికంగా చెప్పకపోయినా లీకైన సోర్సెస్ నుంచి అందిన వార్త మేరకు ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కం కామెడీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దబోతున్నట్టు సమాచారం. కాకతాళీయంగా అందరివాడుకి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాదే ఇప్పుడీ సినిమాకూ పని చేయడం విశేషం. కంపోజింగ్ కూడా మొదలైపోయింది. ఈ రెండు ఓకే కానీ మెహర్ రమేష్ తో ప్లాన్ చేసుకున్న వేదాళం రీమేక్ ఇంతకీ ఎప్పుడు ఉంటుందో మాత్రం క్లారిటీ రావడం లేదు. అసలు ఉంటుందా లేదా అనే అనుమానాలు లేకపోలేదు. ఇక ఆచార్య రిలీజ్ కు సంబంధించిన స్పష్టత రావాలంటే ఇంకొంత కాలం టైం పట్టొచ్చు

Also Read: ఒకటే తేదీ రెండు బ్లాక్ బస్టర్స్