iDreamPost
android-app
ios-app

Crime news బాలిక కిడ్నాప్.. రాత్రంతా కారులోనే గ్యాంగ్ రేప్

  • Published May 14, 2022 | 11:34 AM Updated Updated May 14, 2022 | 11:34 AM
Crime news బాలిక కిడ్నాప్.. రాత్రంతా కారులోనే గ్యాంగ్ రేప్

పదిహేనేళ్ల మైన‌ర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి, రాత్రంతా కారులో తిప్పుతూ, ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణం ఝార్ఖండ్ లో ఆలస్యంగా బైట‌కొచ్చింది. మే 11న‌, బుధవారం రాత్రి, ధుర్వా రింగురోడ్డుపై కారులో వెళ్తున్న యువకులు, అమ్మాయిని కిడ్నాప్ చేసి, కారులోకి లాక్కెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అదేరోజు రాత్రి రతు పీఎస్ పరిధిలో దలాదలి ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు.. రెస్టారెంటు వద్ద ఆగి ఉన్న కారు కనిపించింది.

ఎందుకో ఆ కారు అనుమానాస్పదంగా అనిపించడంతో, పెట్రోలింగ్ పోలీసులు కారును తనిఖీ చేశారు. అందులో ఏడుస్తూ కూర్చున్న మైన‌ర్, ఐదుగురు యువకులు కనిపించారు. ఏం జరిగిందని బాలికను ఆరాతీస్తే, అత్యాచారం జరిగినట్లు చెప్పింది. వెంటనే మైన‌ర్ ను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఐదుగురు యువకులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

jojobet girişgamdomCasibomjojobetJojobet Girişjojobet güncel giriş