iDreamPost
android-app
ios-app

గోలిమార్ నుంచి సీటీమార్ దాకా..

  • Published Jan 27, 2020 | 7:08 AM Updated Updated Jan 27, 2020 | 7:08 AM
  • Published Jan 27, 2020 | 7:08 AMUpdated Jan 27, 2020 | 7:08 AM
గోలిమార్ నుంచి సీటీమార్ దాకా..

హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఆపై విలన్ గా మారి సక్సెస్ కొట్టి మళ్ళీ తిరిగి హీరోగా స్టార్ గా ఎదిగిన గోపిచంద్ కు ఈ మధ్య టైం కలిసి రావడం లేదు. గత కొన్నేళ్లుగా వరసగా చవిచూస్తున్న పరాజయాలు అభిమానులకు నిరాశ కలిగిస్తున్నాయి. భారీ అంచనాలతో స్పై థ్రిల్లర్ గా రూపొందిన చాణక్య గత అక్టోబర్లో విడుదలై డిజాస్టర్ ఫలితాన్నిఅందుకుంది. అంతకు ముందు సినిమాలాదీ అదే దారి. ఇదిలా ఉండగా గోపీచంద్ కొత్త సినిమాకు సీటీ మార్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

సంపత్ నంది దర్శకుడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో గౌతమ్ నందా వచ్చింది. అందులో హీరో పాత్ర ఇద్దరు మిత్రులు తరహాలో డ్యూయల్ రోల్ తో కొత్తగా ట్రై చేసినప్పటికీ గోపికి ఆశించిన ఫలితం దక్కలేదు. అయినా డైరెక్టర్ మీద నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చాడు. మంచి మాస్ సౌండింగ్ తో ఉన్న సీటీ మార్ ఎప్పటినుంచో వాడుకలో ఉన్న పదం. అల్లు అర్జున్ డీజే సినిమాలోని పాటతో దీనికి మరింత ప్రాచుర్యం లభించింది

గతంలో ఇదే సౌండింగ్ తో గోపీచంద్ గోలీమార్ చేశాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ పోలీస్ యాక్షన్ డ్రామా జస్ట్ పర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు సీటిమార్ తో గోపీచంద్ ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. తమన్నా, దిగంగానా హీరోయిన్లుగా నటిస్తుండగా తరుణ్ అరోరా మెయిన్ విలన్ గా చేస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత మణిశర్మ ఈ హీరో సినిమాకు సంగీతం అందిస్తున్నారు. గతంలో ఇదే కాంబోలో యజ్ఞం లాంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. మరి ఈ సీటీ మార్ అయినా గోపీచంద్ కు పూర్వ వైభవం తెస్తుందో లేదో వేసవిలో తేలిపోతుంది. ఇంకా డేట్ ఫిక్స్ చేయని సీటిమార్ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet