iDreamPost
android-app
ios-app

క్రియేటివ్ దర్శకుడికి పెద్ద సవాలే

  • Published Oct 26, 2021 | 9:51 AM Updated Updated Oct 26, 2021 | 9:51 AM
క్రియేటివ్ దర్శకుడికి పెద్ద సవాలే

క్రియేటివ్ దర్శకుడిగా ఒకప్పుడు నిన్నే పెళ్లాడతా, గులాబీ, మురారి లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ని అందించిన కృష్ణ వంశీ గత కొంత కాలంగా తన స్థాయి సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలేతో గాడిన పడతారని ఆశించిన అభిమానులకు చివరికి నిరాశే మిగిలింది. క్యాస్టింగ్ బలంగా ఉన్నా కంటెంట్ వీక్ కావడంతో నక్షత్రం దానికన్నా దారుణమైన ఫలితాన్ని దక్కించుకుంది. అందుకే ఇప్పుడు ఆయన ఆశలన్నీ రంగమార్తాండ మీదే ఉన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. థియేటరా కాదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇవాళ చిరంజీవి దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. ప్రారంభంలో చివరిలో వచ్చే సన్నివేశాల కోసం మెగాస్టార్ తన గొంతుని ఇచ్చారట. రచయిత లక్ష్మి భూపాల రాసిన పంక్తులను బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో వినిపిస్తారు. ప్రకాష్ రాజ్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ మూవీకి ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. మరాఠి బ్లాక్ బస్టర్ నటసామ్రాట్ రీమేక్ గా రూపొందుతున్న ఈ డ్రామా ఎంటర్ టైనర్ లో రమ్యకృష్ణ, అనసూయ, బ్రహ్మానందం లాంటి పవర్ ఫుల్ క్యాస్టింగ్ ఉంది. ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ నటన విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

ప్రకాష్ రాజ్ ఆయనకు సరితూగగల నటుడే కానీ రియలిస్టిక్ గా నడిచే రంగమార్తాండ తెలుగు ప్రేక్షకులను థియేటర్లలో ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. ఇందులో ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. కానీ నాటకాల బ్యాక్ డ్రాప్ ని ఇక్కడి ఆడియన్స్ కి కనెక్ట్ చేయడం చాలా కష్టం. అందుకే కృష్ణవంశీకి ఇది సవాలే. చిరంజీవి కొన్ని నిమిషాల వాయిస్ ఇచ్చినంత మాత్రాన హైప్ అమాంతం రెట్టింపు కాదు కానీ ఫలానా సినిమా ఉందన్న అవగాహన సామాన్య ప్రేక్షకుడికి వస్తుంది కాబట్టి ఆ కోణంలో చూసుకుంటే ప్లస్ పాయింటే. అన్నం అనే మరో ప్రాజెక్ట్ గతంలోనే అనౌన్స్ చేసిన కృష్ణవంశీ దాని అప్డేట్స్ ఇంకా ఇవ్వడం లేదు.

ALSO READ – ఐకాన్ స్టార్ ప్లానింగ్ మారుతోందట