iDreamPost
android-app
ios-app

ఇది జీవన్మరణ సమస్య – మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ

  • Published Mar 29, 2020 | 10:17 AM Updated Updated Mar 29, 2020 | 10:17 AM
ఇది జీవన్మరణ సమస్య – మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ

కరోనా కట్టడిపై ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ లాంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుని వాటి అమలులోకి తెచ్చారు. కరోనా పై అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా మహమ్మారి ఎంత ప్రమాదకరమో దాని వలన ప్రజలకు ఎంత ముప్పు వాటిలన్ననుందో చెబుతూ ప్రజలను అప్రమత్తంగా వ్యవహరించాలని సందేశం ఇచ్చారు. అయితే కొంత మంది మాత్రం ప్రధాని మాటలని సైతం లెక్క చెయకుండా పెడ చెవిన పెడుతూ, నిబందనలు అతిక్రమిస్తూ ఇష్ఠానుసారం వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడి మన్ కీ బాత్ కార్యక్రమంలో మరో సారి కీలక వాఖ్యలు చేశారు.

నేటి ఉదయం మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన దేశ ప్రధాని మోడీ కరోనా కట్టడికి ప్రజలందరూ తప్పనిసరిగా లాక్ డౌన్ ను పాటించాలని మరో మారు కోరారు. భారమైనా ప్రజల రక్షణ కోసమే లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్లు మోడీ చెప్పారు. అందుకే ప్రజలెవరూ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంగించరాదని స్పష్టం చేశారు. కరోనా తీవ్రత ను ప్రజలు ఇంకా తెలుసుకోలేకపోతున్నారని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఆ ముప్పు మీతో పాటు ఇతరులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందన్న విషయం ప్రజలు గుర్తించాలన్నారు. ఈ వైరస్ ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాదనే విషయం ప్రజలు ప్రతి నిమిషం మననం చేసుకోవాలని ఉద్భోదించారు. ఇది మన జీవన మరణ సమస్య అని, గెలవడమే, ఓడిపోవడమో ప్రజలే తేల్చుకోవాలని స్పష్టం చేశారు.