Idream media
Idream media
మా బాబుకు ఎనిమిది ఏళ్ళు . వారం నుండి దాదాపు ఇంట్లోనే ఉంటున్నాడు . కరోనా గురించి అర్థం చేసుకుంటున్నాడు . రెండు రోజుల క్రితం పడుకునేటప్పుడు ” నేను ఒకటి అడుగుతాను చెబుతావా అన్నాడు ” . నాకు కరోనా వస్తే , నన్ను హాస్పిటల్ లో ఉంచితే , మీరు కానీ, అమ్మమ్మ తాతలు గానీ చూడడానికి వస్తారా ? అని అడిగాడు . ఒక్కసారి చాలా emotional అనిపించింది . suddenly గా ఆ ప్రశ్నే ఎందుకు అడిగాడో ? నీకెందుకు వస్తుంది , రాదు కదా ! అని చెబుతూ నవ్వుతూనే టాపిక్ ని డైవర్ట్ చేసాను . ఏవో ధైర్య వచనాలు చెప్పాను .
ఈ రోజు ఢిల్లీ లో ఓ సంఘటన జరిగింది . మొన్న దుబాయ్ నుండి వచ్చిన ఓ మహిళ తనకు కరోనా లక్షణాలు ఉన్నాయనుకుని ఢిల్లీలో ఓ డాక్టర్ ను సంప్రదించింది . అంతే . ఇపుడు మహిళాకు కరోనా వుందీ అని తెలిసింది . ఆ మహిళ ద్వారా ఆ డాక్టర్ కు , ఆ డాక్టర్ ద్వారా ఆయన భార్యకు , అతని కూతురికి మొత్తం నలుగురు కరోనాకు suffer అవుతున్నారు .
అలాగే నిన్న హైదరాబాద్ లో ఓ మూడేళ్ళ పాపకు కరోనా వచ్చింది . ఇపుడు ఆ పాప తన తల్లితండ్రులని విడిచి isolation లో ఎలా ఉండ గలుగుతుందో అన్న ఊహే బాధాకరంగా వుంది . ఆమె దగ్గరికి ఎవరూ రారు . ఆమె ఎవరి దగ్గరికీ వెళ్ళదు .
ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లోని డాక్టర్ దంపతులిద్దరికీ కారోనా వచ్చింది అని ప్రభుత్వం ప్రకటించింది . ఇలా అనేక సంఘటనలు local transmission ( stage 2 ) నుండి community transmission ( stage 3 ) లోకి మారుతాయేమో అనే భయాన్ని కల్పిస్తున్నాయి.
ఇపుడు దేశం lock down లో వుంది . ప్రభుత్వ అధినేతల , ఆరోగ్య నిపుణుల , అధికారుల , ప్రసార మాధ్యమాల ముందు చూపు వల్ల అతి తక్కువ సమయం లోనే ప్రజలకు అవగాహన పెరిగింది . తమ ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి , క్వారంటైన్ కు సిద్ధ పడుతున్నారు . Isolation లో వుంటున్నారు . తమ తమ ఇళ్ళల్లో తలుపులు వేసుకుని వుంటున్నారు .
ఇంత వరకు బాగుంది . ఇవన్ని చేయాల్సిందే . కానీ కామన్ గా చేసే ఇంకొన్ని చిన్న చిన్న తప్పులే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తున్నాయి . అది surface awareness అనేదాన్ని నెగ్లెక్ట్ చేయడం . ప్రతి కుటుంబంలో జరిగేది ఇదే .
ఈ కరోనా వ్యాప్తి సందర్భంలో , మనం ఇళ్ళల్లో తలుపులేసుకుని ఉంటున్నాం . కానీ ఏదో సందర్భంలో నిత్య అవసర వస్తువుల కోసం బయటికి వెళ్తాం . కూరగాయల మార్కెట్ కో , మెడికల్ హాల్ కో , సూపర్ మార్కేట్ కో , ఇతర వ్యాధులకు సంబంధించి హాస్పిటల్ కో వెళ్తుంటాం . నీవు గమనించే ఉంటావు, ఎక్కడ కూడా distance పాటించరు. వీలైతే తోసుకుంటారు . ఒకరు దగ్గుతారు , ఒకరు తుమ్ముతారు . లేదా మాట్లాడుతుంటారు . ఆయా సమయాల్లో అందులో ఏ ఒక్కరు కరోనా పేషంట్ ఉన్నా , అక్కడ surface మీద కరోనా వైరస్ ను వ్యాపిస్తారు . తమ చేతుల ద్వారా ఆ పరిసరాలకు , అతను ముట్టుకున్న వస్తువులకూ , మనుష్యులకు వ్యాపిస్తారు . తనకు కరోనా ఉందీ అని ఆ పేషంట్ కు తెలియదు . అతని వల్ల ప్రమాదం వుందని నీకూ తెలియదు . ప్రతి surface మీద , ఆ surface స్వభావాన్ని ఆధారం చేసుకుని కనీసం ఒక గంట నుండి – 20 గంటల వరకూ ఆ వైరస్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు . ఆ వైరస్ ని వెంట వెంటనే చేతులు కడిగేస్తే పోతుందని కూడా పదే పదే చెబుతున్నారు . అయినా అన్నీ తెలిసి కూడా neglect చేస్తుంటాం . ఈ పరిస్థితుల్లో మన కుటుంబ అనుభవంలోంచే వాటిని ఒక్కసారి గమనిద్దాం .
1. Eexternal surfaces : ఆ వైరస్ నీవు కొంటున్న వస్తువుల మీద ఉండవచ్చు , కూర గాయాల మీద ఉండవచ్చు , బిల్ కౌంటర్ మీద, డెబిట్ కార్డు మిషన్ మీద , క్యాష్ మీద , నీవు చేతితో పట్టుకునే అద్దాల డోర్ మీద ఉండొచ్చు . ఎదుటి వ్యక్తి shirt మీద ఉండవచ్చు . నీవు మాస్క్ వేసుకుని వెళ్ళావనుకో , ఆ మాస్క్ outer shape మీద ఉండొచ్చు ( అందుకే మాస్క్ ని తీసేప్పుడు జాగ్రత్తగా తీయాలి ) , లిఫ్ట్ బటన్ మీద ఉండొచ్చు and so on .
కరోనా ఇపుడు local transmission గా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో, బయటికి వెళ్ళిన ప్రతిసారి , ఆయా సందర్భాలలో ఆ వైరస్ నా మీద అటాక్ చేసే స్కోప్ ఉందీ అని పదే పదే జ్ఞప్తిలో వుంచుకోవాలి . దానికి అనుగుణంగా నీ చేతులకు అంటకుండా ఎలా చేయగలవో చూడు ( for example , you may use vehicle for lift button & swipe machine ) . ఒక వేళ చేయి ఖచ్చితంగా వాడాల్సి వస్తే అక్కడికక్కడే శనటైజర్ వాడడo చేయాలి .
ఆ సమయానికి శానటైజర్ నీ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కన్ను, నోరు , ముక్కు లను చేయితో తాకకూడదు . తొందరగా నీలోకి ఆ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం వుంది . బయటినుండి ఇంట్లోకి రాగానే అర నిమిషం సేపు మోచేతుల వరకు సబ్బుతో లేదా హ్యాండ్ వాష్ తో కడుక్కోవాలి . అలాగే నీవు తెచ్చిన కూరగాయలు , ఇతర వస్తువుల్ని కొన్ని గంటలు అలా కార్ట్ బాక్స్ లో ఉంచాలి . అవసరమైతే బాగా కడగాలి . తరువాత మీ చేతుల్నిసబ్బుతో శుభ్రపరచు కోవాలి .
2. Internal Surfaces by outside effect: ఇక ఇంట్లోనే వుంటే ఇలా చేయాలి . ఏదో సమయంలో వాచ్ మాన్ రూపంలోనో , పాల మనిషి రూపంలోనో , కేబుల్ బిల్ వసూల్ చేసే మనిషి రూపంలోనో , పక్క ఫ్లాట్ వాళ్ళ రూపంలోనో , మీ పిల్లలు పక్క ఫ్లాట్ లోకి వెళ్తేనో , ఆ పిల్లలు మీ ఇంట్లోకి వస్తేనో , ఎవరైనా విజిటర్ రూపంలోనో మీ ఇంటికి వైరస్ రావొచ్చు . ఇది పదే , పదే జ్ఞప్తిలో వుంచుకోవాలి . ఇట్లాంటిది జరిగినపుడు . ఎట్టి పరిస్థితుల్లో కన్ను, నోరు , ముక్కు లను చేయితో తాకకూడదు . వెంటనే ఖచ్చితంగా మోచేతి వరకు అర నిమిషం సేపు, సబ్బుతో లేదా హ్యాండ్ వాష్ తో కడుక్కోవాలి
3. Internal Surfaces by inside effect: ఇంట్లో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వచ్చినపుడు : మాస్కులు వేసుకుని వుండాలి . వారితో కాసింత ఎడంగా వుండాలి . వాళ్లకు విడి గది ఇవాలి .ఈ విషయాలలో చిన్న పిల్లలకు కూడా అవగాహన కల్పించాలి . బాధితుడు వాడుతున్న వస్తువుల పట్ల స్పృహ కలిగి జాగ్రత్త పడాలి . కంప్యూట్ కావొచ్చు , మొబైల్ ఫోన్ కావొచ్చు , ల్యాప్ టాప్ కావొచ్చు , Switch Boards, door కానీ , బెడ్ షీట్స్ కానీ , బట్టలు కానీ ఇలా ఏవైనా కావొచ్చు . ఆత్మీయతలు , సెంటిమెంట్స్ ఎక్కువ కాబట్టి ఇంట్లో వాళ్ళని అనుమానించినా , ఏమవుతుందిలే అని తేలికగా తీసుకుంటాం . అది పొరపాటు . బాధితుడిని కనిపెడుతూ వుండాలి . మాస్కులు వేసుకోవాలి . ఏవి ముట్టినా హ్యాండ్ వాష్ చేసుకుంటూనే వుండాలి . నాలుగైదు రోజుల పరిశీలనలో ఇవి నార్మల్ జలుబు , జ్వరం దగ్గు అని తేలితే సరే . తగ్గే వరకు ఇలానే కంటిన్యూ చేయాలి . లేదంటే డాక్టర్ ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి . కరోనా అని తేలితే దానికి తగినట్లు ప్రభుత్వ సలహాలమేరకు నడుచుకోవాలి .
4. ఇవన్ని తెలిసినట్లే వుంటాయి . ఎన్నో సార్లు విన్నాం కదా అనుకుంటాం . కానీ పాటించం . మన దాకా ఎందుకు వస్తుందిలే అని తేలికగా తీసుకుంటాం . స్పృహతో , జ్ఞప్తి తో ఉండలేం . ఇదే సమస్య . ఇలా చాలా చోట్లా పొరపాట్లు చేస్తుంటాం . ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం . ఈ పనిని పదే పదే పాటిస్తే ఆ ఢిల్లీ సంఘటనలో ఆ డాక్టర్ కుటుంబం బాధితులుగా మారి వుండేవారు కారు . హైదరాబాద్ లోని సంఘటనలు వచ్చేవి కావు . ఇవాళ అమెరికా , ఇటలీ లో అంత మందికి వ్యాపించి ఉండేవి కావు .
5. బయటివాళ్ళు నీ పట్ల ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకుంటావో , అవే జాగ్రత్తలు నీవు బయటి వ్యక్తుల పట్ల తీసుకోవాలి .
6. ఇప్పడికైనా మనకోసం , మన కుటుంబం కోసం ఈ మూడు వారాలు crucial కాబట్టి , కేవలం ఇంట్లోనే ఉందాం . Surface awareness తో జాగ్రత్తలు తీసుకుని మనల్ని మన కుటుంబాన్ని , కాలనీని , రాష్ట్రాన్ని , దేశాన్ని ఈ మహమ్మారిని వ్యాప్తి చేయకుండా చూసి , మరింత నష్టాన్ని జారకుండా చూద్దాం .
7. మన ప్రయత్నం మనం నూటికి నూరు శాతం చేసిన తరువాత , ఏమి తోచనపుడు ఆ ప్రకృతి మీద భారం వదులుదాం . ఆమే చూసుకుంటుంది . అవసరం లేనివి తీసేసి , కావాల్సిన దానిని మాత్రమే ఉంచుతుంది . భయపడక్కరలేదు .
Written By – Ganga Reddy