ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వినూత్న పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ మరో కొత్త పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే ఒకటి నుంచి ఆరో తరగతి విద్యార్థులకు ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించేలా.. డాక్టర్ వైఎస్సార్ చిరునవ్వు అనే పథకాన్ని సీఎం జగన్ ప్రకటించారు.
వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో సీఎం జగన్ ఈ మేరకు ఈ పథకం విధి విధానాలను వెల్లడించారు. ఈ పథకం ద్వారా విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స ఇవ్వడంతోపాటు… టూత్ పేస్ట్, బ్రస్ ఉచితంగా ఇస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డాక్టర్ వైఎస్సార్ చిరునవ్వు పథకం కింద దాదాపు 60 లక్షల మంది చిన్నారులకు దంత పరీక్షలు చేయనున్నారు.
వైఎస్సార్ కంటి వెలుగు పథకంతో ఇప్పటికే పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం, కళ్లద్ధాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దంత వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. వచ్చే జూలై 8వ తేదీ నుంచి ఈ పథకం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభం కానుంది.
5340