iDreamPost
android-app
ios-app

క్రేజీ కాంబినేషన్ లో మెగా 153 ?

  • Published Feb 25, 2020 | 7:23 AM Updated Updated Feb 25, 2020 | 7:23 AM
క్రేజీ కాంబినేషన్ లో మెగా 153 ?

ఏమో అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి జూలై నుంచి పూర్తిగా ఫ్రీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని తర్వాత ఎవరితో చేస్తారనే దాని గురించి ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం మెగా 153ని వంశీ పైడిపల్లి డీల్ చేసే అవకాశం ఉందట. మహేష్ బాబుతో చేయాల్సిన ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉండిపోవడంతో చిరుకు తగ్గ స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. అయితే ఇది స్ట్రెయిట్ సబ్జెక్టు కాదు.

గత ఏడాది మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మోహన్ లాల్ లూసిఫర్ కు తెలుగు రూపంగా ఉండొచ్చట. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన లూసిఫర్ లో వర్తమాన రాజకీయాలను ప్రతిబింబించే సన్నివేశాలతో పాటు పవర్ ఫుల్ హీరోయిజం కూడా ఉంటుంది. అందుకే రామ్ చరణ్ ఏరికోరి మరీ హక్కులు కొన్నాడన్న టాక్ కొన్ని నెలల క్రితమే వచ్చింది. ఒకవేళ వంశీ పైడిపల్లికి నిజంగా ఆఫర్ వచ్చి ఉంటే మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.

రీమేక్స్ పరంగా చిరుకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. పసివాడి ప్రాణం, హిట్లర్, ఠాగూర్ లాంటివి ఇతర బాషల నుంచి తీసుకొచ్చి రీమేక్ చేసుకున్నవే. ఇప్పుడు లూసిఫర్ కూడా వర్కవుట్ అవ్వొచ్చు. అయితే లూసిఫర్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఆల్రెడీ రిలీజైపోయింది. వచ్చిన సంగతి గుర్తించే లోపే వెళ్లిపోయింది. కానీ అమెజాన్ ప్రైమ్ లో దీని వర్షన్ ని స్ట్రీమింగ్ చేసేశారు. ఇప్పటికే లక్షలాది ప్రేక్షకులు చూసేసి ఉంటారు. మరి లూసిఫర్ రీమేక్ ఎంతవరకు సేఫ్ గా నిలుస్తుందనేది చేసే మార్పులను బట్టి ఉంటుంది. కొరటాల శివ సినిమా పూర్తయ్యే లోపు దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావొచ్చు.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş