iDreamPost
android-app
ios-app

సింధియాకు పాజిటివ్‌.. కేజ్రీవాల్‌కు నెగిటివ్‌..

సింధియాకు పాజిటివ్‌.. కేజ్రీవాల్‌కు నెగిటివ్‌..

బీజేపీ యువనేత జ్యోతిరాధిత్య సింధియాకు కరోనా సోకింది. ఇటీవల జ్యోతిరాధిత్య సింధియాకు కరోనా లక్షణాలు కనపడడంతో తల్లితో కలసి ఈ రోజు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వారిద్దరికీ కరోనా నిర్థారణ పరీక్షలు చేసిన వైద్యులు ఇద్దరికీ వైరస్‌ సోకిందని నిర్థారించారు. మూడు ప్రత్యేక బృందాలు జ్యోతిరాధిత్య సింధియా, ఆయన తల్లికి వైద్య సేవలు అందిస్తున్నారు.

కరోనా అనుమానిత లక్షణాలతో ఈ రోజు నిర్థారణ పరీక్ష చేయించుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు నెగిటివ్‌ వచ్చింది. ఆదివారం నుంచి గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్న కేజ్రీవాల్‌ కరోనా వైరస్‌ సోకిందనే అనుమానంతో సెల్ఫ్‌ క్వారంటైన్‌కు వెళ్లారు. ఈ రోజు ఆయనకు పరీక్షలు చేసిన వైద్యులు కరోనా సోకలేదని నిర్థారించారు.

కాగా దేశంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తిస్తోంది. ఈ రోజుకు దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 2.67 లక్షలకు చేరుకుంది. ఒక్క మహారాష్ట్రలోనే కరోనా కేసుల సంఖ్య లక్షకు సమీపంలో ఉంది. రాబోయే రోజుల్లో వైరస్‌ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటుదని వివిధ సంస్థలు వెల్లడిస్తున్నాయి.