iDreamPost
android-app
ios-app

భోగాపురం ఎయిర్‌ పోర్టుకై ముందడుగు: ఏపి ప్రభుత్వంతో జిఎంఆర్‌ ఒప్పందం

  • Published Jun 12, 2020 | 9:14 AM Updated Updated Jun 12, 2020 | 9:14 AM
  • Published Jun 12, 2020 | 9:14 AMUpdated Jun 12, 2020 | 9:14 AM
భోగాపురం ఎయిర్‌ పోర్టుకై ముందడుగు: ఏపి ప్రభుత్వంతో జిఎంఆర్‌ ఒప్పందం

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంకోసం ప్రభుత్వంతో జిఎంఆర్‌ ఒప్పందం కుదర్చుకుంది. సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వం తరపున అధికారులు, జిఎంఆర్‌ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాలవలవన్, జిఎంఆర్‌ ఛైర్మన్‌ జిబిఎస్‌. రాజు సంతకాలు చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి, ఏపిఐఐసి ఛైర్మన్‌ ఆర్ కె. రోజా, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సిఎం వైఎస్ జగన్ ఆశించిన విధంగా చిరస్మరణీయ రీతిలో ఈ ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని జిఎంఆర్‌ ప్రతి నిధులు ముఖ్యమంత్రితో అన్నారు. దీనికోసం ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకుంటున్నామని జిఎంఆర్‌ ప్రతినిధులు అన్నారు. తాము పుట్టిన ప్రాంతంలో ఎయిర్‌ పోర్టు నిర్మాణం చేపట్టడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి సదుపాయం వస్తుందని సిఎం వ్యాఖ్యానించారు. ఎయిర్‌ పోర్టు నుంచి విశాఖ నగరానికి వీలైనంత వేగంగా, సులభంగా, సౌకర్యంగా చేరుకునేలా రహదారులను నిర్మిస్తామని సిఎం చెప్పారు. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేస్తామన్నారు.

అలాగే భోగాపురం ఎయిర్‌పోర్టుకు విశాఖనగరంతో అనుసంధానం చేసేలా మెట్రో ఏర్పాటుపైనా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet