iDreamPost
android-app
ios-app

ఆహా కోసం రంగంలోకి బాలకృష్ణ

ఆహా కోసం రంగంలోకి బాలకృష్ణ

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నారు. ఒకరకంగా బాలకృష్ణ హిట్ కొట్టి చాలా కాలమైంది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో చివరిసారిగా హిట్ అందుకున్న బాలకృష్ణ ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు కానీ ఒక్క సినిమా కూడా ఆయనకు మంచి హిట్ పిచ్చి పెట్టలేక పోయింది. ఈ నేపథ్యంలోనే ఆయన తనకు బాగా కలిసి వచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి అఖండ అనే సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలవడంతో ఈ అఖండ సినిమా కూడా బంపర్ హిట్ గా నిలుస్తుందని నందమూరి అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది కనుక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి..

ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా కూడా ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన అల్లు అరవింద్ అలాగే మై హోం సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆహా యాప్ కోసం ఒక టాక్ షో చేస్తున్నారనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పటివరకు బాలకృష్ణ టీవీ తెరమీద కూడా కనిపించింది తక్కువే. అడపాదడపా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు కానీ ఆయన స్వయంగా ఇలా టాక్ షోస్ లో కూడా పాల్గొన్న దాఖలాలు చాలా తక్కువ.

అయితే ఆహా సంస్థ బాలకృష్ణను ఒక షో చేయమని అప్రోచ్ కాగా అశోక్ కాన్సెప్ట్ నచ్చడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇప్పటికే దీనికి సంబంధించిన డీల్స్ కూడా పూర్తయ్యాయని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.. బాలకృష్ణ ఈ షో ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇస్తూ ఉండగా ఆయన హోస్ట్ గా కూడా మొట్టమొదటిసారిగా వ్యవహరిస్తున్నారు. చేసే ప్రతి ఎపిసోడ్ అలాగే వచ్చే ప్రతి గెస్ట్ ని కూడా చాలా స్పెషల్ గా డిజైన్ చేయడానికి ఆహా నిర్వాహకులు భావిస్తున్నారు. పూర్తిస్థాయి తెలుగు కంటెంట్ తో నడపబడుతున్న ఏకైక ఓటీటీ అయిన ఆహా సంస్థ బాలకృష్ణ షో తమకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టొచ్చు అని అంచనాలు వేస్తోంది. ఇప్పటికే ఆహా సంస్థ నుంచి సమంత హోస్ట్ గా సామ్ జామ్ , రానా హోస్ట్ గా నెం. 1 యారీ, లక్ష్మీ హోస్ట్ గా ఆహా భోజనంబు షోలు వచ్చాయి.

Also Read : లాజిక్ మిస్ అవుతున్న హీరోల ఫ్యాన్స్