iDreamPost
android-app
ios-app

ఒటర్ల జాబితాని ప్రకటించిన ఎన్నికల సంఘం.

  • Published Feb 16, 2020 | 6:41 AM Updated Updated Feb 16, 2020 | 6:41 AM
ఒటర్ల జాబితాని ప్రకటించిన ఎన్నికల సంఘం.

ఆంద్రప్రదేశ్ ఒటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తమ ఒటర్ల సంఖ్య 3 కోట్ల 99 లక్షల 37వేల 394 మంది అని ప్రకటించింది. ఇందులో పురుషుల ఓట్లు 1కోటి 97 లక్షల 21వేల 514 కాగా , మహిళా ఒట్లర్లు 2 కోట్ల 2 లక్షల 4వేల 378 మందిగా తేలింది. రాష్ట్రంలో ఎన్.ఆర్.ఐ ఒటర్లు 7,436, ట్రాన్స్ జండర్ ఒటర్లు 4,066 మంది ఉన్నారని ఎన్నికల సంఘం పెర్కోంది.

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్రంలో మొత్తం 48,836 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చెస్తునట్టు ప్రకటించింది. ముసాయిదా జాబితా తరువత కోత్తగా 1లక్షా 63వేల 30 మంది ఒటర్లు నమొదయ్యారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి విజయానంద్ తెలిపారు. ఇది గత ఒట్లర్ల జాబితా తో పొల్చితే ఈసారి 0.41 శాతం ఒటర్లు నమోదు అవ్వగా 0.15 శాతం డిలీషన్లు ఉన్నట్టు పెర్కోన్నారు.

అత్యధిక జనాభాతో తూర్పుగోదావరి జిల్లా ప్రధమస్థానంలో నిలవగా, అత్యల్ప జనాభాతో విజయనగరం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇంక రెండో అతిపెద్ద జనాభా కలిగిన జిల్లాగా గుంటూరు, 3వ అతిపెద్ద జిల్లాగా విశాఖపట్నం జిల్లాలు నిలిచాయి.

జిల్లాల వారీగా ఒటర్ల జాబితా

శ్రీకాకుళం
పురుషులు = 11,12,643
స్త్రీలు = 11,16,154
మొత్తం = 22,22,474

విజయనగరం
పురుషులు = 9,15,479
స్త్రీలు = 9,40,521
మొత్తం = 18,44,540

విశాఖపట్నం
పురుషులు = 17,86,966
స్త్రీలు = 18,17,653
మొత్తం = 36,05,999

తూర్పుగోదావరి
పురుషులు = 21,02,381
స్త్రీలు = 21,49,627
మొత్తం = 42,47,542

పచ్చిమ గోదావరి
పురుషులు = 15,93,364
స్త్రీలు = 16,54,453
మొత్తం = 32,37,697

కృష్ణా
పురుషులు = 17,62,360
స్త్రీలు = 18,22,202
మొత్తం = 35,80,299

గుంటూరు
పురుషులు = 19,62,042
స్త్రీలు = 20,55,305
మొత్తం = 40,10,809

ప్రకాశం
పురుషులు = 13,16,258
స్త్రీలు = 13,34,816
మొత్తం = 26,48,270

నెల్లూరు
పురుషులు = 11,91,273
స్త్రీలు = 12,39,592
మొత్తం = 24,25,519

కర్నూలు
పురుషులు = 16,25,699
స్త్రీలు = 16,54,464
మొత్తం = 32,65,332

వై.యస్.ఆర్(కడప)
పురుషులు = 11,09,613
స్త్రీలు = 11,42,657
మొత్తం = 22,46,673

అనంతపురం
పురుషులు = 16,53,527
స్త్రీలు = 16,46,628
మొత్తం = 32,86,619

చిత్తురు
పురుషులు = 15,96,531
స్త్రీలు = 16,31,112
మొత్తం = 32,13,003