డిజైనర్ నచికేత్ బార్వేకి డిజైనర్ మహర్ధశ నడుస్తోంది. తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్ (Tanhaji: The Unsung Warrior) చిత్రానికి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్‌గా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. అజయ్ దేవగన్ సినిమా మరో రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం(Best Popular Film)తోపాటు ఉత్తమనటుడి నటుడు (అజయ్ దేవగన్) అవార్డుకూడా దక్కింది. తాన్హాజీకి డైరెక్టర్ ఓం రౌత్(Om Raut). ఇప్పుడు అదే రౌత్ ప్రభాస్, సైఫ్ అలీఖాన్ కృతి సనన్ నటించిన ఆదిపురుష్ ని తీర్చిదిద్దుతున్నాడు. డౌటే లేదు, నచికేత్ బార్వే(Nachiket Barve ) ఆదిపురుష్ కోసం కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేశారు.
ఆదిపురుష ప్రపంచం పౌరాణికం. తాన్హాజీ కథ చరిత్రలోనిది. అందుకే కాస్ట్యూమ్ డిజైనర్ కి ఆదిపురుష్ పెద్ద సవాల్. మరి నచికేత్ బార్వే, ప్రభాస్ కోసం ఎలాంటి కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాడు? ఈ డిజైనర్, పాన్-ఇండియా స్టార్‌ని తెగ పొగిడేశాడు. “ప్రభాస్ మెగాస్టార్, కానీ మంచివాడు, సున్నితమనస్కుడు. వినయమున్న స్టార్లలో ఒకరు. అతను నన్ను నమ్మాడు. కావాల్సిన విధంగా కాస్ట్యూమ్ డిజైన్ చేయడంలో నాకు సహకరించాడు. అతను పోషించే పాత్రపై అద్భుతమైన అవగాహన, కాస్ట్యూమ్ మీద క్లారిటీ ఉంది. మొత్తం షూట్‌ను ఇంత మర్చిపోలేనంత అనుభవంగా మార్చిన అతని ఆప్యాయత , స్నేహానికి నేను కృతజ్ఞుడ్ని అని జాతీయ ఉత్తమ గ్రహీత అన్నారు.
ప్రభాస్ ఇంటి నుండి హైదరాబాదీ వంటకాలను సెట్స్‌లోని ప్రతి ఒక్కరిని తినిపించి పాడుచేస్తాడని నచికేత్ జోక్ చేశాడు.
ఆదిపురుష్ మీద ప్రభాస్ ఫ్యాన్స్ కి చాలా అంచనాలున్నాయి. సలార్ యాక్షన్ అయితే, ఆదిపురుష్ ఒక కొత్త లోకానికి తీసుకెళ్ళనుంది. ఈ సినిమా జనవరి 12 2023న రిలీజ్ కానుంది.
81842