iDreamPost
android-app
ios-app

తారక్ ఫ్యాన్స్ తో బంగారం భామ ఫైట్

  • Published Jun 03, 2020 | 8:09 AM Updated Updated Jun 03, 2020 | 8:09 AM
తారక్ ఫ్యాన్స్ తో బంగారం భామ ఫైట్

సెలబ్రిటీలు ప్రెస్ మీట్ లోనో లేదా ఏదైనా ఇంటర్వ్యూలోనో ఏదైనా మాట్లాడినా లేక నోరు జారినా దాని వల్ల నష్టం ఒకప్పుడు చాలా పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడలా కాదు. ఆన్ లైన్ వచ్చాక అందులోనూ మన స్టార్లు ట్విట్టర్, ఇన్స్ టా లాంటి ప్లాట్ ఫార్మ్స్ వాడటం మొదలుపెట్టాక ఎంతైతే ఉపయోగం అంతకు మించి వీటి వల్ల నరకమూ ఉంది. దీని వల్ల బాధితులుగా మారి తమ అకౌంట్లే డిలీట్ చేసుకున్నవాళ్ళు ఎందరో ఉన్నారు. ఎవరిదాకో ఎందుకు స్వయానా రామ్ చరణే కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మీరా చోప్రాకు పెద్ద చిక్కే వచ్చి పడింది.

తెలుగులో పవన్ కళ్యాణ్ బంగారంతో పరిచయమైన మీరా చోప్రా ఆ తర్వాత వాన, గ్రీకు వీరుడు, మారో లాంటి కొన్ని సినిమాలు చేసిది అవేవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కొన్నేళ్ళు తమిళ్ హిందిలో కొనసాగి ఇక్కడ బ్రేక్ తీసుకుంది. ఇటీవలే తాను ఒక అభిమాని ట్వీట్ కు బదులు చెప్పడం నానా రచ్చకు దారి తీసింది. జూనియర్ ఎన్టీఆర్ గురించి మీ అభిప్రాయం చెప్పమని ఓ ఫ్యాన్ అడిగితే నాకు ఎవరో తెలియదని చెప్పడమే కాదు పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల గురించి పాజిటివ్ గా చెప్పడం రచ్చకు దారి తీసింది. ఇంకేముంది తారక్ ఫ్యాన్స్ తనపై ముప్పేట దాడికి తెగబడ్డారు. అసభ్య పదజాలంతో దూషించడమే కాక ఏకంగా ఆమె తల్లితండ్రులకు కరోనా రావాలని శాపనార్థాలు పెట్టారు. అంతే కాదు ఇక్కడ రాయడానికి సభ్యత అడ్డొచ్చే దారుణమైన తిట్లు కూడా లంకించుకున్నారు.

మీరా చోప్రా వీటికి బదులిస్తూ ఇలా బెదిరించే వాళ్ళను మీరు ప్రోత్సహిస్తారా, నన్ను చంపుతామంటున్నారంటూ జూనియర్ ఎన్టీఆర్ నే ట్యాగ్ చేసింది. అక్కడితో ఇది ఆగలేదు. అభిమానులు ఇంకా రెచ్చిపోయారు. దీంతో అలాంటి కామెంట్స్, ట్వీట్స్ అన్నింటిని స్క్రీన్ షాట్ తీసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది మీరా చోప్రా. డబ్బింగ్ ఆర్టిస్ట్ కం సింగర్ చిన్మయి మీరాకు మద్దతు ప్రకటించారు. మొత్తానికి మీరా చోప్రా, తారక్ ఫ్యాన్స్ మధ్య గత పన్నెండు గంటలుగా ట్విట్టర్ వేదికగా ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. అధిక శాతం ఫేక్ పేర్లతో నడిచే ట్విట్టర్లో దోషులను పట్టుకోవడం కొంచెం కష్టమే. అయినా సింపుల్ గా తారక్ మంచి యాక్టర్ అని ఓ మాట అనేస్తే పోయేదానికి రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న స్టార్ గురించి ఎవరో తెలియదు అని చెప్పడం కొంచెం విచిత్రమే. ఏదైతేనేం ఇలాంటి బెదిరింపు ధోరణికి అభిమానులు పాల్పడటం ఎంతైనా అభ్యంతరకరం, శిక్షార్హం

marsbahis girişjojobet girişjojobetjojobet girişjojobetjojobet girişjojobet girişjojobet giriş