iDreamPost
android-app
ios-app

నా పెళ్ళి ఖర్చు కేవలం 7,500.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఇంద్రజ

నా పెళ్ళి ఖర్చు కేవలం 7,500.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఇంద్రజ

సినీ పరిశ్రమలో ప్రేమ వివాహాలు మనం చాలానే చూస్తూ ఉంటాం. వారంతా ఎంతో ఘనంగా, వైభవంగా తమ వివాహ వేడుకను జరుపుకుంటారు. అయితే కొంతమంది మాత్రమే చాలా సాధారణంగా, అతి తక్కువమందితో పెళ్ళి చేసుకుంటారు. అలాంటి వ్యక్తుల్లో నటి ఇంద్రజ ఒకరు.

ఇటీవల బుల్లితెర కార్యక్రమాల్లో సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న ఇంద్రజ ఒక షోలో పెళ్ళి ప్రస్తావనలో భాగంగా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. జబర్దస్త్ షో చూసే వారందరికీ ఇంద్రజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె వివాహం విషయం కూడా చాలా మందికి తెలిసిన అంశమే. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో ఇంద్రజ తన పెళ్ళి టాపిక్ పై మాట్లాడటం వైరల్ గా మారింది.

తమది ప్రేమ వివాహం అని చెప్పిన ఇంద్రజ.. పెళ్ళి ఎంత సింపుల్ గా జరిగిందో చెప్పుకొచ్చింది. తన పెళ్ళికి కేవలం 7,500 రూ/- మాత్రమే ఖర్చు అయ్యిందని, కేవలం 13 మంది మాత్రమే పెళ్ళికి వచ్చారంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

వాస్తవానికి ఇంద్రజ మతాంతర వివాహం చేసుకున్నారు. ఇంద్రజ భర్త పేరు మహ్మద్ అబ్సర్. వీరిద్దరి మధ్య చిగురించిన స్నేహం కాస్తా పెళ్ళికి దారి తీసింది. తాను మనసుకు నచ్చిన వ్యక్తినే పెళ్ళి చేసుకున్నానని.. కుల, మతాలు చూడలేదని చెప్తారు ఇంద్రజ.

jojobet girişJOJOBET GİRİŞgamdomCasibomjojobetJojobet Giriş