iDreamPost
android-app
ios-app

కరెంట్ బిల్లు vs వైట్ రేషన్ కార్డు .

  • Published Jan 30, 2020 | 1:09 AM Updated Updated Jan 30, 2020 | 1:09 AM
కరెంట్ బిల్లు  vs వైట్ రేషన్ కార్డు .

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత సంక్షేమ పథకాల జోరులో వైట్ రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి వివిధ పథకాల ద్వారా హీన పక్షం యాడాదికి యాభై వేల నుండి గరిష్టంగా లక్ష వరకూ లబ్ది పొందే అవకాశం ఉంది .

అయితే అర్హులను సర్వే ద్వారా గుర్తించే క్రమంలో విధించిన ఓ నిబంధన మూలంగా ఇప్పటివరకూ రేషన్ కార్డు ఉన్న కొందరు పార్టీలకతీతంగా లబ్ధిదారుల జాబితాలో లేకుండా పోతున్నారు .

ఏమిటా నిబంధన ?  కరెంట్ బిల్లు మూడు వందల యూనిట్లకు మించితే వైట్ రేషన్ కార్డ్ కట్ .
కొన్ని విద్యుత్ ఉపకరణాలు విలాసం కేటగిరి , సౌకర్యం కేటగిరి నుండి అవసరం , అత్యవసరంగా మారిన నేటి జీవన విధానంలో నలుగురైదుగురు సభ్యులు ఉండే కుటుంబం రోజుకి సగటున ఎంత కరెంట్ వాడుతుందో చూద్దాం .

3 cfl బల్బ్స్ ఎనిమిది గంటలు – 240 వాట్స్
1 ట్యూబ్లైట్ ఎనిమిది గంటలు – 240 వాట్స్
2 ఫాన్స్ పన్నెండు గంటలు -1440 వాట్స్
టీవీ 1 ఆరు గంటలు. – 600 వాట్స్
1 మిక్సీ పావు గంట – 100 వాట్స్
1 hp మోటార్ అర గంట. – 500 వాట్స్
200 litre ప్రిడ్జ్ 24 గంటలు -1500 వాట్స్
0.5hp గ్రైండర్ పదినిమిషాలు- 50 వాట్స్
గీజర్ , బకెట్ హీటర్ పావు గంట- 375 వాట్స్
సెల్ చార్జర్ , పవర్ లాసెస్. – 100 వాట్స్
మొత్తం …………. 5145 వాట్స్
5145 watts =5.145 units per day ×30 days=
154 .35 units per month.

ప్రస్తుతం నడుస్తున్న జీవన శైలిలో ఓ మధ్యతరగతి కుటుంబ అవసరాలకి నెలకి ఖర్చయ్యే విద్యుత్ 154 . 35 యూనిట్స్ . గ్రైండర్ వారంలో రెండు సార్లు వాడతారు కాబట్టి రోజు సగటులోకి , గీజర్ ఆర్నెల్లు వాడతారు కాబట్టి రోజు సగటులోకి మార్చి లెక్కించడం జరిగింది . పల్లెటూరులో కాస్త పెద్ద ఇల్లు లేదా గేదెల కొష్టాలకి కూడా ఇంటి కనెక్షన్ నుండి వాడినా , టౌన్లో మరికొన్ని చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు వాడినా అత్యధికంగా 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ అవసరం పడదు మధ్య తరగతి ఫ్యామిలీకి .

మరి 300 యూనిట్స్ వాడే అవకాశమే లేదా అంటే ఉంది “AC” అనే ఉపకరణం రూపంలో . ఒక 1.5 టన్ AC రన్ అవటానికి గంటకు 1.5 నుండి 2 యూనిట్స్ అవసరమవుతుంది . రోజుకి పది గంటలు వాడినా 20 యూనిట్స్ అంటే నెలకి 600 యూనిట్స్ వాడకం పెరిగిపోతుంది , మొత్తం 800 యూనిట్స్ అవుతుంది , యూనిట్ రేట్ స్లాబ్ మారిపోతుంది , బిల్లు అమాంతం పెరిగిపోతుంది

గతంలో విలాసంగా భావించే AC ప్రస్తుతం కనీస అవసరాల కేటగిరిలోకొచ్చింది . కొంచెం ఎగువ మధ్యతరగతి నుండి మధ్యతరగతి వారు కూడా కొనటానికి మోజు పడుతున్న AC వలన వచ్చే విద్యుత్ బిల్లు మూలంగా ఇప్పుడు కొన్ని వేల రేషన్ కార్డులకి ముప్పు వచ్చి పడింది .