iDreamPost
android-app
ios-app

ఒక్కరోజులో 9996 పాజిటివ్ కేసులు-357 మరణాలు

ఒక్కరోజులో 9996 పాజిటివ్ కేసులు-357 మరణాలు

,.కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 9వేలకు పైగా కేసులు, 200 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. కానీ నిన్న తొలిసారిగా 300 కు పైగా మరణాలు సంభవించాయి.  కాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 9996 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 357 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా సంభవించిన మరణాల్లో ఇదే అత్యధికం. దాదాపు 10వేల పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,86,579 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 8,102 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల్లో నిన్న నమోదయిన కేసులే అత్యధికం. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఐదవ స్థానంలో కొనసాగుతోంది.  కరోనా వైరస్ బారినుండి 1,41,029 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 1,37,448 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య పెరుగుతుండడంతో భారత్ కరోనా మరణాల్లో ప్రపంచంలో 11 వ స్థానానికి చేరుకుంది. పాజిటివ్ కేసుల విషయంలో నాలుగవ స్థానానికి చేరువలో ఉంది.

మహారాష్ట్రలో 3254 పాజిటివ్ కేసులు నిర్దారణ

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 3254 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 94041 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 3438 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 52,667 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. 1857 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో నిన్న కొత్తగా అత్యధికంగా 191మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 4111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2138 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 1817 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 156 మంది మృత్యువాత పడ్డారు.నిన్న ఒక్కరోజే 8 మరణాలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 136 కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 5247 మందికి కరోనా సోకగా 78 మంది మృత్యువాత పడ్డారు. 2869 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2300 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 7,458,921 మందికి కోవిడ్ 19 సోకగా 419,020 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 3,778,218 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 2,066,401 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 115,130 మంది మరణించారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş