P Venkatesh
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆన్ లైన్ క్లెయిమ్స్ కోసం కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఇకపై మరింత ఈజీగా ఆన్ లైన్ క్లెయిమ్ పరిష్కారం కానుంది.
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆన్ లైన్ క్లెయిమ్స్ కోసం కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఇకపై మరింత ఈజీగా ఆన్ లైన్ క్లెయిమ్ పరిష్కారం కానుంది.
P Venkatesh
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఆయా సంస్థలు పీఎఫ్ సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి. ప్రతి నెల వారి అకౌంట్ నుంచి కొంత మొత్తాన్ని పీఎఫ్ అకౌంట్ లో జమచేస్తుంటాయి. ఈ డబ్బు ఉద్యోగి రిటైర్మెంట్ అనంతరం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాదు అత్యవసర సమయాల్లో పీఎఫ్ లో జమ అయిన సొమ్మును విత్ డ్రా చేసుకుని తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ ఖాతాదారులకు మరింత సులభంగా సేవలను అందించేందుకు కొత్త రూల్స్ ను తీసుకొస్తుంది. తాజాగా మరో రూల్ ను ప్రవేశపెట్టింది. ఇకపై ఆన్ లైన్ క్లెయిమ్స్ మరింత సులభంగా మారనున్నాయి.
పీఎఫ్ ఖాతాదారులు డబ్బు డ్రా చేసేందుకు ఆన్ లైన్, ఆఫ్ లైన్లలో క్లెయిమ్ చేసుకుంటుంటారు. ఆన్ లైన్ లో క్లెయిమ్ చేసుకునే వారు దరఖాస్తులో భాగంగా చెక్ లీఫ్, అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రాలను అప్‌లోడ్ చేయవలసిన అవసరాన్ని సడలించినట్లు ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. ఆన్ లైన్ క్లెయిమ్ లను త్వరగా పరిష్కరించేందుకు కొత్త రూల్ ను తీసుకొచ్చింది ఈపీఎఫ్ఓ. ఆన్‌లైన్‌లో ఫైల్ చేసినప్పుడు చెక్ లీఫ్/అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రం అప్‌లోడ్ చేయని కారణంగా తిరస్కరణకు గురయ్యే క్లెయిమ్‌ల సంఖ్యను తగ్గించడానికి ఈ కొత్త రూల్ ను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది.
ఇటీవల ఈపీఎఫ్ ఓ తీసుకొచ్చిన కొత్త రూల్ తో తమ సబ్‌స్క్రైబర్లు మరణిస్తే ఆధార్ కార్డు సమర్పించాల్సిన అవసరం లేకుండా సంబంధిత వ్యక్తి కుటుంబ సభ్యులు పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే దీనికోసం మరణించిన ఉద్యోగి పని చేస్తున్న సంస్థలో హెచ్ఆర్ విభాగం తమ ఉద్యోగి మరణించారని నిర్ధారిస్తూ ఈపీఎఫ్ఓ వెబ్ సైట్లో తెలియపరచాల్సి ఉంటుంది. వివరాలు అన్నీ సరిచూసుకున్నాక ఈపీఎఫ్ఓ కార్యాలయం ఆఫీసర్ ఇన్‌చార్జీ (ఓఐసీ) అనుమతి ఇస్తే.. సదరు వ్యక్తి పీఎఫ్ విత్ డ్రా ప్రక్రియ మొదలవుతుంది. ఆధార్ డేటా బేస్‌లో సమాచారం అసంపూర్ణంగా ఉన్నప్పుడే ఈ నిబంధన వర్తిస్తుందని ఈ నెల 17న జారీ చేసిన ప్రకటనలో ఈపీఎఫ్ఓ వెల్లడించింది. మరణించిన ఈపీఎఫ్ఓ ఖాతాదారుడికి ఆధార్ లేకపోయినా.. ఆ సబ్ స్క్రైబర్ నామినీ ఆధార్ సిస్టమ్‌లో సేవ్ అవుతుంది. నామినీ సంతకం చేయడంతోపాటు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధంగా మరణించిన వ్యక్తి ఆధార్ లేకపోయినా కూడా పీఎఫ్ విత్ డ్రా చేయొచ్చు.